SAKSHITHA NEWS

సాక్షిత : రేగళ్ల దగ్గర కాల్వ తండాలో 45 కోట్లతో నూతనంగా నిర్మించిన పంప్ హౌస్ ను పరిశీలించిన : ఎమ్మెల్యే వనమా
పంప్ హౌస్ నుండి కొత్తగూడెం పట్టణానికి నీటి తరలింపును దగ్గరుండి పర్యవేక్షించిన : ఎమ్మెల్యే వనమా
వేసవిలో కొత్తగూడెం పట్టణంలో నీటి ఎదట రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన : ఎమ్మెల్యే వనమా


లక్ష్మీదేవి పల్లి మండలం కాల్వ తండాలో 45 కోట్లతో నిర్మించిన కిన్నెరసాని పంప్ హౌస్ ను పరిశీలించి, పంప్ హౌస్ నుండి కొత్తగూడెం పట్టణానికి కిన్నెరసాని నీటి సరఫరాను దగ్గరుండి పర్యవేక్షించిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు .
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ వేసవిలో కొత్తగూడెం పట్టణానికి నిరంతరాయంగా కిన్నెరసాని నీటి సరఫరా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు, కొత్త పంప్ హౌస్ నిర్మాణం వలన నీటి సరఫరా అంతర ఏర్పడిందని ఇకముందు నీటి సరఫరా లో ఎటువంటి అంతరాయం కలగదని తెలియజేసిన ఎమ్మెల్యే వనమా.

ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, మున్సిపల్ కమిషనర్ రఘు, లక్ష్మీదేవి పల్లి ఎంపీపీ శ్రీమతి భుఖ్య సోనా, కౌన్సిలర్లు కోలాపురి ధర్మరాజు, రుక్మైందర్ బండారి, బండి నరసింహా, అంబుల వేణు, బుక్య శ్రీను, బాలిశెట్టి సత్యభామ, కూరపాటి విజయలక్ష్మి, వనచర్ల విమల, మోరే రూప, కో ఆప్షన్ సభ్యులు దూడల బుచ్చయ్య, కనుకుంట్ల పార్వతి, దుంపల అనురాధ,TPO ప్రభాకర్, మేనేజర్ సత్యనారాయణ, AE లు రాము, సాహితీ బిఆర్ఎస్ నాయకులు సుందర్ రాజ్, కొండ స్వామి, రామకోటి, సర్పంచ్ ఒంజి, బాలాజీ మరియు స్థానిక బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు


SAKSHITHA NEWS