సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
రవాణా శాఖ నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్న 200 వాహనాలను సీజ్ చేసి జరిమానా విధించినట్లు ట్రాఫిక్ ఏసీపి సారంగపాణి తెలిపారు. జిల్లా కేంద్రంలోని పలు కూడళ్లలో గత నాలుగు రోజులుగా ట్రాఫిక్ పోలీసులు నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్ తో లైసెన్సు,నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న వాహనాలు సీజ్ చేసి జరిమానా విధిస్తున్నారని తెలిపారు. ఆనంతరం కౌన్సిలింగ్ నిర్వహించి నెంబర్ ప్లేట్ తీసుకొని వచ్చిన వారికి వాహనాలను తిరిగి అప్పగిస్తునట్లు తెలిపారు.
నిబంధనల ప్రకారం వాహనదారులు తప్పనిసరిగా తమ వాహనాలకు ముందు, వెనుక వైపు నంబర్ ప్లేట్ కలిగి ఉండాలన్నారు. ఇకపై తరచూ తనిఖీలు నిర్వహిస్తామని నంబర్ ప్లేట్ లేకున్నా వాహనానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాలని అన్నారు. స్టైల్, వెరైటీ, ఫ్యాషన్ పేర్లతో తమ బైక్‌లకు కంపెనీ ఇచ్చిన సైలెన్సర్లను మార్చి న్యూసెన్స్ క్రియేట్ చేసే వారిపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. అందులో భాగంగా ఇటీవల సైలెన్సర్స్ విక్రయించేషాపులు, సైలెన్సర్స్ బిగించే మెకెనిక్ షాపుల యజమానులకు కౌన్సిలింగ్ నిర్వహించినట్లు తెలిపారు.
సైలెన్సర్ల నుంచి వచ్చే శబ్దాలు వల్ల తోటి వాహనదారులు, స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. కొన్ని సయయాల్లో కంట్రోల్ తప్పి ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. అలాంటి పరిస్థితులను కల్పించే వాహనదారులపై చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు. కార్యక్రమంలొ ట్రాఫిక్ సిఐ ఆశోక్ , ఎస్సై రవి పాల్గొన్నారు.