SAKSHITHA NEWS

ఎంపీ నామ నాగేశ్వరరావు ఆహ్వానంతో న్యూఢిల్లీలో ఖమ్మం జిల్లా ఎంపీపీల స్టడీ టూర్

విజ్ఞాన సముపార్జన కోసం వివిధ చారిత్రక ప్రదేశాల సందర్శన
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

బి అర్ ఏస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు ఆహ్వానం మేరకు స్టడీ టూర్ లో భాగంగా ఖమ్మం జిల్లాకు చెందిన ఎంపీపీల బృందం న్యూఢిల్లీ చేరుకుంది.విజ్ణాన సముపార్జనలో భాగంగా న్యూఢిల్లీలోని పలు చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రదేశాలను ఈ సందర్భంగా సందర్శించి తిలకించారు.

చారిత్రక ప్రదేశాలైన హ్యూమాయూన్ స్మారక మందిరం ( సమాధి ), ఇండియా గేట్ , రెడ్ పోర్ట్, లోటస్ టెంపుల్, కాల్ కజయ్ మందిర్, హనుమాన్ టెంపుల్, టెర్మినల్ తదితర చారిత్రక ప్రదేశాలను ఎంపీపీలు సందర్శించారు. ఈ బృందం లో ఎంపీపీలు సామినేని హరిప్రసాద్ ( ముదిగొండ ), దొడ్డా శ్రీనివాసరావు ( తల్లాడ ), ఎల్. వినీల్ కుమార్ ( పెనుబల్లి ), పగుట్ల వెంకటేశ్వరరావు ( వేంసూర్ ), కొపూరి పూర్ణయ్య ( చింతకాని ), బాణోత్ శ్రీనివాస్ ( కూసుమంచి ), బొడా మంగీలాల్ ( తిరుమలాయపాలెం ) , భూక్యా గౌరీ, భూక్యా లాల్య ( రఘునాధపాలెం), వజ్జా రమ్య , వజ్జా శ్రీనివాసరావు ( నేలకొండపల్లి ), దొడ్డా హైమావతి, దొడ్డా శంకర్ రావు( సత్తుపల్లి ), కోట పావని, వేల్పుల భాస్కర్ రావు ( వైరా ),మాలోత్ శకుంతల, మాలోత్ కిషోర్ ( సింగరేణి ), దేవరకొండ శిరీష,

దేవరకొండ చిరంజీవి ( ఎర్రుపాలెం ), కంకణాల సౌభాగ్యం, కంకణాల గోపాలరావు ( బోనకల్ ), బాణోత్ సునీత, బాణోత్ రాందాస్ ( కామేపల్లి ) తదితర 23 మంది సభ్యులు ఉన్నారు.ఆదివారం కూడా ఆగ్రా తో పాటు పలు చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తారు


SAKSHITHA NEWS