SAKSHITHA NEWS

పరిశరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

డీఎంహెచ్ఓ డా.వెంకటేశ్వరరావు
రాజమహేంద్రవరం, సాక్షిత :
ప్రస్తుతం వర్షాకాలం అయినందున ప్రజలందరూ ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలని,
దోమల నివారణ కొరకు ఇంటిలోపల బయట ఆవరణలోను నీటి నిల్వలు ఉంచకుండా జాగ్రత్త పడాలని ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. కె. వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు 1వ సచివాలయ ప్రాంతంలో వైద్య ఆరోగ్యశాఖ నిర్వహించిన “ఫ్రైడే డ్రై డే” (శుక్రవారం – పొడి వారం) కార్యక్రమంలో పిహెచ్సి సిబ్బందితో కలిసి డీఎంహెచ్వో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం సీజన్లో ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉంటూ వ్యాధులకు గురికాకుండా పరిసరాలను పరిశుభ్రముగా ఉంచుకోవాలన్నారు.

దోమల కారణంగా మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులకు ప్రబలకుండా ఇంటి పరిసర వాతావరణంలో నీటి నిల్వలో లేకుండా జాగ్రత్తపడాలన్నారు. ప్రజలందరూ కాచి చల్లార్చిన నీటిని, వేడిగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలని కోరారు. ఎవరైనా జ్వర లక్షణాలతో కూడిన అనారోగ్యానికి గురైతే వెంటనే సమీపంలో పీహెచ్సీ వైద్య సిబ్బందిని సంప్రదించి అవసరమైన వైద్య పరీక్షలను ఉచితంగా చేయించుకోవాలని ఆయన తెలియజేశారు. ” ఫ్రైడే డ్రై డే” (శుక్రవారం – పొడి వారం) కార్యక్రమంలో   బొమ్మూరు – 1 వ సచివాలయం  ప్రాంతంలో ఉన్న మురుగు నీటి కాల్వలో దోమల లార్వా నియంత్రణకు మందును పిచికారి చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా కార్యాలయ సిబ్బందితోపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ధవలేశ్వరం  వైద్య సిబ్బంది  పాల్గొన్నారు.


SAKSHITHA NEWS