SAKSHITHA NEWS

విద్యా వ్యవస్థను పటిష్టం చేసిన ఘనత కేసీఆర్ ది – ఎమ్మెల్యే చిరుమర్తి
విద్యార్ధులకి పుస్తకాల గది ప్రారంభం
చిట్యాల సాక్షిత ప్రతినిధి

విద్యా వ్యవస్థను పటిష్టం చేసిన ఘనత కేసీఆర్ ది అని నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య అన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామం ప్రాథమిక పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య పాల్గొని జాతీయ పతాకావిష్కరణ చేశారు. అనంతరం మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో ఆధునికీకరణ చేసిన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన పుస్తకాల గది (రీడింగ్ రూమ్) ని ప్రారంబించి విద్యార్ధులకి రాగి జావ పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకులు ఎవ్వరు విద్యా వ్యవస్థను పట్టించుకోలేదని, కానీ నేడు సిఎం కేసీఆర్ పాలనలో పండుగలా విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని సంతోషం వ్యక్తం చేశారు, ప్రశాంతమైన వాతావరణంలో, ఆహ్లాదకరమైన తరగతి గదులతో ప్రైవేటు స్కూల్లకు దీటుగా మన సర్కారు బడులు మెరుగులు దిద్దుకున్నాయని కొనియాడారు.

కేసీఅర్ ప్రభుత్వం ఉంటేనే ఈ పథకాలు కొనసాగుతాయని అలాగే ఇంకా కొత్త పథకాలను ప్రవేశపెట్టి విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలతో విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని, తల్లిదండ్రులు వారి చిన్నారులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని సూచించారు. అనంతరం విద్యార్ధులకి స్కూల్ యూనిఫాం, పాఠ్య పుస్తకాలని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొలను సునీత వెంకటేష్ గౌడ్, జడ్పిటిసి సుంకరిద్దనమ్మ యాదగిరి చిట్యాల మున్సిపాలిటీ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ జడల ఆది మల్లయ్య, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కూరెల్ల లింగస్వామి, ఎంపీఓ పద్మ, మండల విద్యాధికారి కుకుట్ల నరసింహ, చిట్యాల డి ఈఈ విష్ణువర్ధన్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వై.జానకి, ఉపాధ్యాయురాలు ఎండి అదిలా భేగం, ఎస్ ఎంసి చైర్మన్ మేడి వీరస్వామి, వివిధ హోదాలలో ఉన్న నాయకులు అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS