నీలం మధును ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం..
నీలం మధు తోనే అన్ని వర్గాలకు సమన్యాయం..
బీసీ వర్గాలకు అవకాశం ఇవ్వండి…
నీలం మధుకు మద్దతుగా పటాన్చెరువు మండలం పెద్దకంజర్లలో బీసీ సంఘాల రాస్తారోకో..
ముఖ్యమంత్రి కేసీఆర్ నీలం మధుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక్క అవకాశం ఇవ్వాలని పలు సబ్బండ వర్గాల నాయకులు డిమాండ్ చేశారు.
బహుజన రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ కి పటాన్చెరు ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ పటాన్చెరువు మండలం పెద్దకంజర్ల గ్రామంలో రహదారి పై రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏండ్ల నుంచి స్వచ్చందంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నీలం మధు ముదిరాజ్ కు పటాన్ చెరు ఎమ్మెల్యే అభ్యర్థిగా కేసీఆర్ పోటీచేసే అవకాశం కల్పించాలని కోరారు. నీలం మధు బీ అర్ ఎస్ పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడ్డాడని పార్టీ కి పిల్లర్ లాగా పనిచేస్తాడని తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పటాన్ చెరు ఎమ్మెల్యే టికెట్ పై పునరాలోచించుకొని బిసి నాయకుడైన నీలం మధు ముదిరాజ్ కు కేటాయించాలని డిమాండ్ చేశారు.బీసీ సామాజికవర్గానికి కేసీఆర్ ప్రాధాన్యత కల్పించాలని కోరారు. లేనిపక్షంలో తామంతా నీలం మధు ముదిరాజును స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయించి అన్ని వర్గాలను ఏకం చేసి, ఇంటింటికి ప్రచారం నిర్వహించి ఎమ్మెల్యేగా గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో గంగయ్య,నర్సింలు,రమేష్,ముత్యాలు,నాగభూషణం, లక్ష్మి నారాయణ, శ్రీ హరి,మహేష్, లక్ష్మణ్, సత్యా నారాయణ, బాల రం,రాజు,మల్లేష్,నరేష్,గోపాల్,అజయ్,నాగరాజు, సాయి కృష్ణ,నిరంజన్,గణేష్,పర్వతాలు,రమేష్,తదితరులు, పాల్గొన్నారు.