SAKSHITHA NEWS

KCR blackmails own party MLAs

సొంత పార్టీ ఎమ్మెల్యేలను కెసిఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు:బూర నర్సయ్యగౌడ్

సాక్షిత హైదరాబాద్‌: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పోల్చితే తెలంగాణలో నిర్బంధాలు ఎక్కువయ్యాయని.. తాను తెరాసను ఎందుకు వీడుతున్నానో ప్రజలు గ్రహించాలని భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ సూచించారు. భాజపా ఉద్యమ పార్టీ అయితే.. తెరాస ఉద్యమ ద్రోహుల పార్టీగా రూపాంతరం చెందిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బూర మాట్లాడారు.

‘‘ఆత్మగౌరవం కోసం ఈటల రాజేందర్, స్వామి గౌడ్, జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నేను తెరాస నుంచి బయటకు వచ్చాం. తెలంగాణలో భాజపా అధికారంలోకి రావడం ఖాయం.

మునుగోడు ఉపఎన్నిక కారణంగా కేసీఆర్ గట్టుప్పల్ మండలాన్ని ఇచ్చారు. కేసీఆర్‌కు ఓట్లు.. సీట్లు.. డబ్బులే ముఖ్యం. ఒక్కో ఎమ్మెల్యే బూత్‌కు రూ.2 కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. సొంత పార్టీ ఎమ్మెల్యేలనే కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఉపఎన్నిక తరువాత వరదలాగా భాజపాలో చేరుతారు. ఫ్లోరోసిస్‌ పోయిందని చెబుతున్న తెరాస నేతలు ఫ్లోరోసిస్ అధ్యయన కేంద్రం ఎందుకు కోరుతున్నారు? లేని రోగానికి వైద్యం చేయడానికేనా?’’ అని బూర నర్సయ్యగౌడ్‌ ప్రశ్నించారు.


SAKSHITHA NEWS