SAKSHITHA NEWS

అమెరికా వెళ్లి వచ్చే వరకు మీ సభ్యత్వం ఉంటాదో లేదో చూసుకో : కౌశిక్ రెడ్డి

హైదరాబాద్:
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తొమ్మిదో రోజు కొనసాగనున్నాయి. ఇవాళ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేశారు. పలు శాఖల రిపోర్ట్ ను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది.

సభలో జాబ్ క్యాలెండర్ ను ప్రభుత్వం విడుదల చేయ నుంది. జాబ్ క్యాలెండర్ కు చట్టబద్ధతపై చర్చ జరగ నుంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందు మీడియా పాయిం ట్ వద్ద హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. బీఅర్ఎస్ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు అవుతుందో లేదో కానీ మీరు అమెరికా వెళ్లి వచ్చే వరకు సభ్యత్వం రద్దు అయ్యేలా ఉందంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దే శిస్తూ వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి బెదిరిస్తే బయటపడే వాళ్ళు ఎవరు లేరని అన్నారు.అసెంబ్లీలో సబితా ఇంద్రారెడ్డిని అవ మానించిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.

అమెరికా వెళ్లి వచ్చే వరకు మీ సభ్యత్వం ఉంటాదో లేదో చూసుకో .. ఖమ్మం, నల్గొండ మంత్రులు మీ సభ్యత్వం రద్దు చేసేలా ఉన్నారని కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు.

అసెంబ్లీ లో మైక్ ఇవ్వడం లేదు. ప్రజా సమస్యలను లేవనెత్తే అవకాశం కల్పిం చడం లేదని, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపించారు.

WhatsApp Image 2024 08 02 at 12.39.20

SAKSHITHA NEWS