SAKSHITHA NEWS

అసెంబ్లీ సాక్షిగా క్యాలెండర్‌ విడుదల?

హైదరాబాద్:
తెలంగాణ ప్రభుత్వం నేడు జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయనుంది. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించనున్నారు.

ఆ మేరకు నిన్న జరిగిన తెలంగాణ కేబినెట్ సమా వేశంలో మంత్రులు నిర్ణయం తీసుకున్నారు. జాబ్ క్యా లెండర్‌కి ఆమోదం తెలిపిన కేబినెట్… నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఏడాది నిర్దిష్టమైన కాల వ్యవధిలో ఉద్యోగ నియా మకాలు చేపట్టనుంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతీ ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటి స్తామని కాంగ్రెస్ పార్టీ హామి ఇచ్చింది. ఎన్నికల హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం నేటి అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటించ నుంది.

మరోవైపు నేటితో అసెంబ్లీ సమావేశాలు ముగియను న్నాయి. ఎనిమిది రోజుల పాటు హాట్ హాట్‌గా సమావేశాలు సాగాయి. చివరి రోజు కావడంతో మరింత హీట్‌గా సమావే శాలు జరిగే అవకాశం ఉంది.

నేటి సభలో జాబ్ క్యాలెం డర్‌తో పాటు ధరణి, హైదరాబాద్ అభివృద్ధిపై చర్చ జరగనుంది.


SAKSHITHA NEWS