SAKSHITHA NEWS

భూ కుంభకోణంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య..?

ముఖ్యమంత్రిని విచారించేందుకు గవర్నర్ అనుమతి

బెంగళూరు :
కర్ణాటక రాజకీయాల్లో మైసూరు నగరాభివృద్ధి ప్రాదికార భూ కుంభకోణం కలకలం సృష్టిస్తోంది. దానివల్ల ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు రాజకీ యంగా ఇబ్బందికర పరిస్థి తులు ఎదరవుతున్నాయి.

తాజాగా కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ సంచల న నిర్ణయం తీసుకున్నారు. ముడా స్థలం కేటాయింపు కుంభకోణంలో ముఖ్య మంత్రి సిద్ధరామయ్యను విచారణ చేసేందుకు గవర్నర్ ఉదయం ఆమోదం తెలిపారు.

దీంతో ఈ కేసులో సీఎం విచారణను ఎదుర్కోను న్నారు. దీనికి సంబంధించిన సమాచారం అందినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.

సామాజిక కార్యకర్త, న్యాయవాది టిజె అబ్రహం తన భార్య బీఎం పార్వతికి కేటాయించిన భూమికి సంబంధించిన కేసులో సీఎం సిద్ధరామయ్యను ప్రాసిక్యూ ట్ చేయడానికి అనుమతిం చాలని కోరుతూ కొద్దివారా ల క్రితం గవర్నర్ కు పిటీషన్ దాఖలు చేశారు.

ఈ పిటీషన్ పై గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం సిద్ధరామయ్యపై విచారణకు ఆమోదం తెలిపారు. కొద్దిరోజుల ముందు తనపై విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్ ను గవర్నర్ తిరస్కరిస్తారని సీఎం సిద్ధరామయ్య విశ్వాసం వ్యక్తం చేశారు.

WhatsApp Image 2024 08 17 at 13.37.46

SAKSHITHA NEWS