Kanna Lakshmi Narayana comments
సాక్షిత : కన్నా లక్ష్మి నారాయణ వ్యాఖ్యలు సబబే కార్యకర్తల కష్టం తెలిసిన నేత కార్పోరేట్ వ్యవస్థ కాదు రాష్ట్రంలో బిజెపి కార్యకర్తల ఆవేదననే తెలిపారు బిజెపి ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ నాయకులు :నవ్యాంధ్ర మాజీ కమల దళపతి కన్నా లక్ష్మి నారాయణ వ్యాఖ్యలు సబబేనని బిజెపి నేత కొర్రపాటి తెలిపారు ఆంధ్రప్రదేశ్ లో కన్నా లక్ష్మి నారాయణ సారధ్యం లో ప్రజల సమస్యల పై రాజీ లేని పోరాటాలతో బిజెపి దూసుకెళ్లిందని ప్రజల పక్షాన నిలబడి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగిందని అందుకే బిజెపి పార్టీతో జనసేన వంటి పార్టీలు పొత్తులకు రావడం ఇతర రాజకీయ పార్టీల నేతలు మాజీ మంత్రులు కూడా బిజెపి లోకి వచ్చారని.
ఏపీ బిజెపిలో కన్నా లక్ష్మి నారాయణ నాయకత్వంలో విద్యావంతులు మేథావులను ప్రోత్సహించడం జరిగిందని గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకూ సై అంటే సై ఢీ అంటే ఢీ అనేలా ఒక్కో కార్యకర్త 100మంది తో సమానంగా దీటుగా రాష్ట్రంలో బిజెపి ని తిరుగులేని శక్తిగా నిలబెట్టారని.
కన్నా బిజెపిని ఇతరజకీయ పార్టీలకు ధీటుగా పొలిటికల్ ట్రెండ్ సెట్టర్ గా నిలబెట్టారని ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి మరియు జనసేన వంటి బలమైన పార్టీలు బిజెపి ని వీడుతున్నాయంటే దేనికి సంకేతం లక్షలాది మంది కార్యకర్తల కష్టం బూడిదైపోయినట్లేనా అని ఆవేదన చెందుతున్నారని కన్నా అంటే కార్యకర్తల కష్టం తెలిసిన నేత అని కార్పోరేట్ వ్యవస్థ కాదని జాతీయ స్థాయి నేతగా పార్టీ హితవు కోరడం సబబేనని కన్నా వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నట్లు బిజెపి దళిత నేత కొర్రపాటి సురేష్ విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు పలువురు బిజెపి ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ నాయకులు కూడా కన్నా వ్యాఖ్యలను సమర్ధించారు.