సాక్షిత సికింద్రాబాద్ : సితాఫలమండీ, మెట్టుగూడ మున్సిపల్ డివిజన్లకు సంబంధించిన కళ్యాణ లక్ష్మి, శాదిముబరాక్, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కలను డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ సితాఫలమండీ లోని క్యాంపు కార్యాలయం లో జరిగిన కార్యక్రమంలో అందించారు. కార్పొరేటర్ లు సామల హేమ, రాసురి సునీత, బీ ఆర్ ఎస్ యువ నేత కిషోర్ కుమార్, తీగుళ్ల రమేశ్వర్ గౌడ్ నాయకులు కరాటే రాజు, జలంధర్ రెడ్డి, రాజ సుందర్ అధికారులు, నేతలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ మాట్లాడుతూ సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పేద, మధ్య తరగతులకు చెందిన ప్రజలు అధికంగా ఉన్నారని, వారి సంక్షేమానికి కృషి చేస్తామని తెలిపారు. దళారీల ప్రమేయాన్ని నివారించేందుకు నేరుగా ప్రజలతో తాము సాన్నిహిత్యాన్ని ఏర్పరుచు కుంటున్నామని, ప్రభుత్వ పధకాల్లో ఎవరికీ డబ్బులు అడిగితే అడిగితే సితాఫలమండీ లోని తమ క్యాంపు కార్యాలయాన్ని సంప్రదించాలని పద్మారావు గౌడ్ సూచించారు. సితాఫలమండీ డివిజన్ నుంచి రూ.22 లక్షలు విలువజేసే 23 చెక్కులు, మెట్టుగూడ డివిజన్ నుంచి 19 లక్షల విలువజేసే 19 చెక్కులను ఈ సందర్భంగా అందించారు.
కళ్యాణ లక్ష్మి పధకం పేదలకు వరం : తీగుల్ల పద్మారావు గౌడ్
Related Posts
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్
SAKSHITHA NEWS హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్, భాగ్య నగర్ కాలనీలలో రూ.64 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి ముఖ్యఅతిథిగా…
ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్
SAKSHITHA NEWS ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్ అయ్యారు. అయితే ఆయన…