ఘనంగా కల్వకుర్తి వాసవి క్లబ్ కె సి జి ఎఫ్,వనిత క్లబ్ ప్రమాణ స్వీకారం

Spread the love

ఘనంగా కల్వకుర్తి వాసవి క్లబ్ కె సి జి ఎఫ్,వనిత క్లబ్ ప్రమాణ స్వీకారం.

కల్వకుర్తి పట్టణంలోని వాసవి క్లబ్ భవనంలో 2023 సంవత్సరానికి గాను నూతన వాసవి వనిత క్లబ్ కార్యవర్గo ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ విద్యా సంకల్ప KCGF జూలూరి రమేష్ బాబు, జిల్లా గవర్నర్ మేడిశెట్టి రామకృష్ణ ఇంటర్నేషనల్ డైరెక్టర్ కల్వ హరికృష్ణ హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన జూలురి రమేష్ బాబు మాట్లాడుతూ వాసవి క్లబ్ సేవలు ప్రజలకు అందుబాటులో ఉండలని ప్రతి పల్లెకు వాసవి క్లబ్ సేవలు అందాలని అన్నారు.


జిల్లా గవర్నర్ మేడిశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ పర్మినెంట్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని విద్యకు ప్రాధాన్యతనియాలని అన్నారు. ఆ తర్వాత 2023 సంవత్సరానికి గాను కల్వకుర్తి వాసవి వనిత క్లబ్ అధ్యక్షులుగా చిదీరే శ్రీ లక్ష్మీ శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శిగా కల్వ లక్ష్మీ అంజనేయులు, కోశాధికారిగా దుగ్గి ధనలక్ష్మి అశోక్ గార్లచే ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యవర్గంచే క్యాబినెట్ సెక్రెటరీ గుడిపల్లి ప్రవీణ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్యాబినెట్ ట్రెజరర్ ఆకుతోట మధుమోహన్,కల్వ మనోహర్, నీల లింగం, శివ జగదీశ్వర్ కలిమిచేర్ల గోపాల్ గుగ్గిల శంకర్ దాచేపల్లి మనోహర్, క్యాబినెట్ జాయింట్ ట్రెజరర్ కళిమిచెర్ల స్వాతి,రీజియన్ చైర్మన్ ఇరువెంటీ రమేష్, రీజన్ సెక్రెటరీ జూలూరి సత్యనారాయణ, జోన్ చైర్మన్ పోల విజయకుమార్, అవోపా అధ్యక్షులు వీరబొమ్ము విజయభాస్కర్, ఇన్స్టాలేషన్ చైర్మన్ పాపిశెట్టి స్వరూప శ్రీనివాసులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page