SAKSHITHA NEWS

జ్యోతి బా పూలే వేడుకలు ఘనంగా నిర్వహించిన ఎంపీపీ జల్లిపల్లి

వివక్షలేని సమానత్వ సమాజం కోసం జీవితాంతం శ్రమించిన గొప్ప సామాజిక తత్వవేత్త జ్యోతిబా ఫూలే

జ్యోతిబా ఫూలే సేవలను స్మరించుకొన్న మండల నాయకులు

ఘనంగా మహాత్మా
జ్యోతిబా ఫూలే 197 వ జయంతి వేడుకలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజక కేంద్రమైన అశ్వారావుపేట లోని
ఈ రోజు జ్యోతిబా ఫూలే 197 వ జయంతి సందర్భంగా స్థానిక రింగ్ రోడ్ సెంటర్ నందు అలాగే మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు జ్యోతీ బా పూలే గారి చిత్ర పటానికి పూలమాలలు వేసి అయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ఎంపీపీ జల్లిపల్లి.శ్రీరామమూర్తి మరియు మండల నాయకులు. అనంతరం ఎంపీపీ గారు మాట్లాడుతూ సామాజిక దార్శనికుడుగా, సంఘసంస్కర్తగా,వర్ణ వివక్ష వ్యతిరేక పోరాటానికి బాటలు వేసిన మహా నీయుడు ఫూలే అని వారిని స్మరించుకొన్నారు. వివక్షలేని సమానత్వ సమాజం కోసం జీవితాంతం శ్రమించిన గొప్ప సామాజిక తత్వవేత్త అనీ
2014 కు ముందు పాలించిన పాలకులు పూలే ఆశయ సాధన కు వ్యతిరేఖంగా పాలన కొనసాగిస్తే,జ్యోతిబా ఫూలే స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు. సబ్బండవర్ణాల సాధికారత, సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లోని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. వెనకబడినవర్గాల విద్యాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థను ఏర్పాటుచేసి,అన్ని నియోజకవర్గాల్లో బీసీ గురుకులాలు నెలకొల్పిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బాలికల కోసం ప్రత్యేక గురుకులాలను స్థాపించిందని,బలహీనవర్గాల విద్యార్థుల విదేశీ ఉన్నత విద్యాభ్యాసానికి ఫూలే బీసీ విదేశీ విద్యానిధి పథకం కింద ఒక్కొక్కరికి రూ.20 లక్షల వరకు ఆర్థికసాయం అందజేస్తున్నామని పేర్కొన్నారు.బీసీ వర్గాల కోసం కెసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని వివరించారు.బడుగు, బలహీన వర్గాల సమగ్రాభివృద్ధి కోసం పాటుపడుతూ, వారి జీవితాల్లో కేసీఆర్ వెలుగులు నింపుతున్నారని అన్నారు.

ఫూలే ఆశయ సాధన దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లోని రాష్ట్ర ప్రభుత్వ కృషి నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని ఆ మహనీయుడు స్ఫూర్తితోనే మనం అందరం ముందుకు వెళదామని తెలుపుతూ పూలే గారికి పూల దండలు వేసి ఆయనను స్మరించుకున్నా అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి.శ్రీరామమూర్తి మరియు మండల నాయకులు. ఈ కార్యక్రమం లో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బండి పుల్లారావు, ఉపాధ్యక్షులు బండారు శ్రీనివాసరావు, మల్లయిగూడెం సర్పంచ్ నారం.రాజశేఖర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి యుఎస్ ప్రకాష్, సొసైటీ చైర్మన్ చెన్నంశెట్టి సత్యనారాయణ,బిఆర్ఎస్ పార్టీ అశ్వరావుపేట టౌన్ ప్రెసిడెంట్ సత్యవరపు సంపూర్ణ,మండల నాయకులు మండపాటి రాజమోహన్ రెడ్డి, జూపల్లి రమణారావు,తాడేపల్లి రవి, కాసాని చంద్రమోహన్, కలపాల శ్రీనివాసరావు,చిప్పనపల్లి శ్రీను, యువజన విభాగం అధ్యక్షులు మోటూరి మోహన్,మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది సూపర్డెంట్ ప్రసాద్, యు డి సి కుమారి,ఎల్డిసి శ్రీనివాసరావు, టైపిస్టు ప్రసాద్,వెంకట్రావు రాజేశ్వరి, అటెండర్స్ పాష,చారి సిబ్బంది కార్యకర్తలను,
తదితరులు పాల్గొన్నారు..


SAKSHITHA NEWS