SAKSHITHA NEWS

*మంత్రి దామోదర్ ఆదేశాలతోనే అక్రమ కేసులు
కాంగ్రెస్ పార్టీ నాయకుల క్వారీల పైన కేసులు ఎందుకు నమోదు చేయరు..
అక్రమ కేసుల నమోదుపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యల పరిష్కారంలో లేదు
కాంగ్రెస్ పార్టీలో చేరుతారా లేకుంటే అక్రమ కేసులు ఎదుర్కోవడానికి సిద్ధమా..
కక్షపూరిత రాజకీయాలకు చిరునామాగా కాంగ్రెస్ పార్టీ
అక్రమ కేసులను న్యాయస్థానంలో ఎదుర్కుంటాం..
బిఆర్ఎస్ పార్టీ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి అరెస్ట్ను తీవ్రంగా ఖండించిన మంత్రి హరీష్ రావు..
ప్రజల ఆశీర్వాదంతో హ్యాట్రిక్ విజయం సాధించాం..
దశాబ్ది కాలంలో కక్ష సాధింపులకు అవకాశం ఇవ్వలేదు
మేము తప్పు చేస్తే మూడుసార్లు గెలిచే వాళ్ళం కాదు
కాంగ్రెస్ పార్టీలో చేరకపోవడం మూలంగానే అక్రమ కేసులు నమోదు
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర మాజీమంత్రి సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు..
మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్స్..
రాష్ట్రం లో వంద రోజుల పాలన ఎలా తయారు అయ్యింది అంటే కాంగ్రెస్ పార్టీలో చేరాలి అంటే లేదంటే అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు
ఖమ్మం లో మూడు రోజులకు ఒకసారి నల్లా వస్తోంది..
అక్రమ కేసులతో వేధిస్తున్నారు
వందల మంది పోలీసులతో కలిసి తెల్లవారుజామున మూడు గంటలకు వెళ్లి అరెస్టు చేయడం ఎంత వరకు సమంజసం
అంత అవసరం ఏముంది
నోటీసులు ఇవ్వరు..
ఎఫ్ ఐ ఆర్ కాఫీ ఇవ్వరు
ప్రభుత్వాలు శాశ్వతం కాదు
గత పదేళ్ళలో ఎప్పుడు కక్ష్య పూరితంగా వ్యవహరించ లేదు
స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సి ఉన్న. కేవలం జైలు కు పంపాలని, కాంగ్రెస్ లో చేర్చుకోవాలని కుట్ర pannitjunnaeu
ఇటువంటి విధానాలు మార్చు కావాలి
మంత్రి ఆదేశాలతో టార్గెట్ చేస్తున్నారు
కాంగ్రెస్ నాయకుల క్వారీలు మీద ఎటువంటి చర్యలు లేవు
వరుసగా కేసులు నమోదు చేస్తూ ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదు
వంద రోజులు పూర్తి అయ్యాయి..హామీల అమలు పూర్తి కాలేదు
సోషల్ మీడియా ద్వారా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు
చివరకు ధర్మమే గెలుస్తుంది
కోర్టుల ద్వారా అంతిమంగా న్యాయమే గెలుస్తుంది
మీ కుట్రలను ప్రజల ముందుకు తీసుకొని వెళ్తాము
మెడ మీద కత్తి పెట్టి జాయిన్ చేసుకుంటున్నారు
ప్రజాస్వామ్యంలో ఇది పనికి రాదు
ప్రజల మనసు గెలవండి
ప్రతి పక్షం లేకుండా చేయాలి అనుకోవడం కరెక్టు కాదు
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కామెంట్స్:
దేశం మొత్తం ఎన్నో క్వారీలు ఉన్నాయి
తప్పు చేస్తే శిక్ష వేయండి
పటాన్చెరు నియోజకవర్గంలో గత పదేళ్ళలో ఎవరి మీద కక్ష్య సాధింపు చర్యలు చేపట్ట లేదు
ప్రజల ఆశీర్వాదంతో మూడు సార్లు ఎమ్మెల్యే గా ఎన్నిక అయ్యాను
నేను తప్పు చేస్తే మూడు సార్లు గెలిచే వాళ్ళం కాదు
పూర్తి పర్మిషన్స్ తో నడిపిస్తున్నము
బెదిరింపులకు బయపడం
ప్రజా కోర్టు లో తేల్చుకుందాం
కింది స్థాయి నుండి ప్రజల మద్దతుతో రాజకీయాల్లో కొనసాగుతున్నము..
ఈ సమావేశంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు..

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

WhatsApp Image 2024 03 15 at 11.13.43 AM

SAKSHITHA NEWS