హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ (BRS Party) నుంచి తనను సస్పెండ్ (Suspend) చేసినందుకు చాలా ఆనందంగా ఉందని జూపల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao) అన్నారు.
ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే క్వార్టర్స్ (Old MLA Quarters) దగ్గర మీడియాతో మాట్లాడుతూ పంజరంలో నుంచి బయటపడినట్లు ఉందన్నారు. దొరలగడీ నుంచి బయటకు వచ్చానని, పార్టీ సభ్యత్వం చేస్తామంటే కూడా పుస్తకాలు ఇవ్వలేదన్నారు. తనను ఎందుకు సస్పెండ్ చేస్తున్నారో సీఎం కేసీఆర్ (CM KCR) చెప్పాలన్నారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పి సస్పెండ్ చేయాలన్నారు. బీఆర్ఎస్ బండారం బయటపడుతుందనే తనను సస్పెండ్ చేశారని జూపల్లి కృష్ణారావు అన్నారు..