Journalists should be recognized in Telangana Independence Day celebrations
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జర్నలిస్టులను గుర్తించాలి
తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు -కందుకూరి యాదగిరి
…..
సాక్షిత : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన జర్నలిస్టులను తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో గుర్తించాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి విడుదల చేసిన ఒక ప్రత్యేక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన ఉద్యమాలను ప్రపంచ నలుమూలలకు తెలిసేలా చేసింది జర్నలిస్టులు మాత్రమే అన్నారు. ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు వ్యాపారస్తులు కవులు కళాకారులు రచయితలు ఇలా సబ్బండ వర్గాల వారు చేసిన ఉద్యమాలను చూసి నాటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించడం దాని వెనుక ముమ్మాటికి జర్నలిస్టుల పాత్ర మాటలకు అందనిది అన్నారు. రాష్ట్రంలో అన్ని జర్నలిస్టు సంఘాల వారు ప్రత్యక్ష పరోక్ష ఉద్యమాలలో పాల్గొని రాష్ట్రం సిద్ధించడానికి ప్రధాన కారకులు అయిన సంగతి ప్రస్తుత ప్రభుత్వాలు ప్రభుత్వాలు మర్చిపోవద్దు అని యాదగిరి విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం పై దృష్టి సారించాలని ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలైనా రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టుల బతుకులు మాత్రం ఏమీ మారలేదు అన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ కార్యచరణ తెలిపారు.ఇందుకోసం జర్నలిస్టులు అందరూ సంఘాలకు అతీతంగా సమయాత్తం కావాలని పిలుపునిచ్చారు.