విస్తుపోయిన జర్నలిస్టులు..
ఇటీవల అర్హులైన జర్నలిస్టులందరికీ 3 సెంట్ల స్థలం ఇచ్చేందుకు జీవో జారీ చేసిన జగన్ సర్కార్..
అర్హులను గుర్తించేందుకు జిల్లా కమిటీలను ఏర్పాటు చేసిన ప్రభుత్వంజిల్లా ఇంచార్జ్ మంత్రి చైర్ పర్సన్ గా కమిటీ ఏర్పాటు..చాలా జిల్లాల్లో సమావేశమైన అర్హులైన జర్నలిస్టులను గుర్తించి తీర్మానాలు చేసిన కమిటీలు
కమిటీలు ఎంపిక చేసిన జర్నలిస్టులకు కొనసాగుతున్న నివేశన స్థలాల ఎంపిక ప్రక్రియఈ క్రమంలో కృష్ణాజిల్లాలోనూ సమావేశమైన కమిటీ..
మచిలీపట్నంకు సంబంధించి 40 మందికి నివేశన స్థలాలకు ఇవ్వాలని తీర్మానం..
తీర్మానం చేసిన ఒర్జినల్ కాపీలు ఆఫీసులో ఉండకుండా చెత్త కుప్పలో దర్శనమివ్వటంతో అవాక్కయిన జర్నలిస్టులుచెత్త కుప్పలో చించిపడేసిన తీర్మాన కాపీలను సేకరించిన ఓ జర్నలిస్టు..
ఆ తీర్మాన కాపీలో సాక్షాత్తు జిల్లా ఇంచార్జ్ మంత్రితో పాటు కమిటీ సభ్యుల సంతకాలు ఉండటం మరింత విస్మయానికి గురి చేసింది..
అసలు ఈ తీర్మాన కాపీలు చెత్త కుప్పలో ఎవరు చించి పడేశారు..!? ఆ అవసరం ఎవరికి వచ్చింది..!?
సమాచార శాఖ కార్యాలయంలో గోప్యంగా ఉండాల్సిన అత్యంత విలువైన ఫైల్ ఇలా చెత్త కుప్పలో పడేయడం వెనుక ఎవరి హస్తం ఉంది…!?దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్న జర్నలిస్టులు..ఈ ఘటనపై సీరియస్ గా స్పందించిన జిల్లా కలెక్టర్ పి రాజాబాబువిచారణకు ఆదేశించిన కలెక్టర్..విచారణ అధికారిగా జాయింట్ కలెక్టర్ ని నియమించిన కలెక్టర్…బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించిన కలెక్టర్