ఒకరు యాభైఐదు… మరొకరు ఇంచుమించు అదే సంవత్సరాల అనుభవం కలిగిన సీనియర్లు
★ కోటు గుర్తు కే ఓటు వేయాలని వినూత్నంగా ప్రచారం లో జైభీమ్ రావ్ భారత్ పార్టీ(జేబీపీ) సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్.
వారిరువురూ మాజీ మంత్రులు .. తమ మాటల చాతుర్యంతో ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చడంలో దిట్టా…
ఒకరు యాభైఐదు…మరొకరు ఇంచుమించు అటుఇటుగా అదే సంవత్సరాల అనుభవం కలిగిన సీనియర్లు…కళాశాల చదువుకునే రోజుల్లో నుంచే రాజకీయాల్లో అడుగుపెట్టి నేటికీ కొనసాగుతూ రాష్ట్ర స్థాయిలో తమకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు.. అలాంటీ గండరపెండెముల నాయకులతో స్థానికుడు…యువకుడు విద్యావంతుడు ఎన్నికల్లో పోటీ పడుతున్నాడు.. వినూత్న ప్రచారంలో చాపకింద నీరులా దూసుకుపోతున్నాడు…అతనే జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ …
తెదేపా సత్తెనపల్లి నుంచి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ., అదేవిధంగా వైకాపా నుంచి తాజా మాజీ మంత్రి అంబటి రాంబాబు పోటీ పడుతున్నారు. వీరిలో కన్నా కాంగ్రెస్ పార్టీ నుంచి పెదకూరపాడు లో వరసగా నాలుగు సార్లు గెలిచారు. 2009 లో అదే పార్టీ నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఐదోసారి గెలిచి పలు శాఖల మంత్రిగా పనిచేశారు. అనంతరం భాజాపా అధ్యక్షుడుగా కొనసాగి ఇప్పుడు తెదేపా చేరి సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తున్నాడు..
అంబటి రాంబాబు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకసారి రేపల్లె నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి మృతి అనంతరం వైకాపా లో చేరి సత్తెనపల్లి నుంచి రెండు సార్లు పోటీ చేస్తే ఒకసారి ఓడిపోయారు. రెండో సారి గెలిచి మంత్రి అయ్యాడు. ముచ్చటగా మూడో సారి పోటీ చేస్తున్నాడు..
జైభీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) పాత్రికేయుడు, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ బరిలో నిలుచున్నారు. కళాశాల అధ్యాపకుడిగా (లెక్చరర్).. ఓ ప్రముఖ పత్రిక, ఛానల్ పాత్రికేయుడుగా.. న్యాయవాదిగా...ఇప్పుడు రాజకీయ నాయకుడిగా అంచెలంచెలుగా ఎదిగాడు..ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ స్పూర్తితో అడుగులు వేశాడు. పార్టీ అధినేత జడ శ్రావణ్ కుమార్ పిలుపుతో రాజకీయాల్లో అడుగులు వేశాడు.
వైసీపీ..,తెదేపా, జనసేన., భారతీయ జనతా పార్టీ తదితర పార్టీల అభ్యర్థుల కంటే ముందుగా జైభీమ్ రావ్ భారత్ పార్టీ(జేబీపీ) అధినేత జడ శ్రావణ్ కుమార్.. జొన్నలగడ్డ విజయ్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ఏడాది క్రితమే ప్రకటించారు. దింతో అప్పటి నుంచే నియోజకవర్గంలో ఆయన ప్రజా క్షేత్రంలో తిరుగుతూ వారితో మమేకం అవుతున్నారు.
సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో సుమారు 40 సంవత్సరాల నుంచి దళిత యువ రైతులు రెండు ఎకరాల ప్రభుత్వ భూమి సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈనేపథ్యంలో ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే క్రమంలో దళిత యువ రైతుల తరపున పోరాటాలు చేసి ఆ భూమి వారికి ఉండేలా కృషి చేశారు. అదేగ్రామంలో ప్రభుత్వ మద్యం దుకాణం ఆదాయం రావట్లేదంటూ ఎస్సీ కాలనీలో ఏర్పాటు చేస్తున్నడంతో కాలనీ వాసుల కు అండగా నిలబడి ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాలు వచ్చి ఆ ప్రయత్నాన్ని విరవింపజేశారు. అదేవిధంగా దసరా., బతుకమ్మ దీపావళి, వినాయక చవితి, సంక్రాంతి, ఉగాది, ముక్కోటి ఏకాదశి రంజాన్ పండుగ సందర్భంగా ఉపవాసం ఉన్న ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందులు..,క్రిస్మస్ పండుగకు పేదలకు శాంత క్లాజ్ వేషధారణలో బహుమతులు అందజేశారు. క్రైస్తవుల శ్రమల దినాల్లో చర్చిలో ప్రేమ విందు తదితర కార్యక్రమాలు నిర్వహించారు...
అయ్యప్ప మాల దారులకు ఉదయం బిక్షా ఏర్పాటు, దర్గా లో జరిగిన ప్రత్యేక దువా ఆయన పాల్గొని ప్రార్ధనలు చేయటం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటూ అన్ని వర్గాల వారితో కలిసిపోయారు.
స్మశానం లో ఎన్నికల ప్రచారం.. ఓటర్ల జాబితాలో మృతుల పేర్లు తొలగించకుండా సుమారు 40 మంది కి పైగా ఉంచటంతో జాబితా పారదర్శకంగా లేదంటూ అధికారుల తీరును నిరసిస్తూ స్మశానంలో ఎన్నికలు ప్రచారం నిర్వహించి అధికారులు తీరును ఎండగట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు ఇతర దేశాల్లో ఉన్న ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. అదేవిధంగా గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ స్థానికత యువకుడు… విద్యావంతుడని ప్రజా సేవకై తొలి అడుగు వేస్తున్నా కోటు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నాడు.