SAKSHITHA NEWS

JE vaccination of young children at Basti Davakhana in Rajiv Gandhinagar

సాక్షిత : 116 అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ డివిజన్ లోని రాజీవ్ గాంధీనగర్ లో ఉన్న బస్తి దవాఖానా లో చిన్న పిల్లల JE వ్యాక్షిణేషన్ సందర్భంగా పర్యటించారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ BRS ప్రభుత్వం పిల్లలకు మెదడు వాపు వ్యాధి రాకుండా JE వ్యాక్సిన్ వేయటం ప్రారంభించింది అని ,ఈ వ్యాక్సిన్ ను మొదటగా డివిజన్ లోని రాజీవ్ గాంధీనగర్ లో ఉన్న బస్తి దవాఖానా ప్రారంభించాం అని అన్నారు.అలాగే BRS ప్రభుత్వం పేద పిల్లల కోసం ఉచితంగా వేస్తుంది అని, డివిజన్ లో 9 నెలలు నిండిన ప్రతి బిడ్డకి వేస్తున్నాం అని ,అలాగే ప్రతి ఒక్క తల్లితండ్రి 9 నెలలు నిండిన బిడ్డకి ఈ వ్యాక్షిణ్ ను వేయించాలి అని చెప్పారు .

ఈ సందర్భంగా హాస్పిటల్ సిబ్బందితో పిల్లలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వ్యాక్షిణ్ వేయాలని చెప్పటం జరిగింది. బస్తి వాసులు BRS ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం పట్ల హర్షం వ్యక్తం చేసారు అని అన్నారు.ఈ కార్యక్రమం లో అషు,సల్లాఉద్దీన్ ,దుర్గ ,షమ,జ్ఞానేశ్వర్ ,మరియు యోగిరాజ్ తదితరులు పాల్గొన్నారు .


SAKSHITHA NEWS