చిట్యాల (సాక్షిత ప్రతినిధి)
జూనియర్ పంచాయతీ సెక్రటరీలు తమ సర్వీస్ ని క్రమబద్ధీకరించాలని కోరుతూ ఎంపీడీవో లాజర్ కి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు కార్యదర్శులు మాట్లాడుతూ ఈ రోజుతో నాలుగు సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్ కాలాన్ని పూర్తి చేసుకున్నామని
ఈ కాలాన్ని సర్వీస్ గా పరిగణిస్తూ ప్రభుత్వం వెంటనే జిఓ విడుదల చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి పనుల్ని విజయవంతంగా నిర్వహించడంలో, అలాగే తాజాగా కేంద్రం ప్రకటించిన జాతీయస్థాయి పంచాయితీ అవార్డులలో తెలంగాణ రాష్ట్రానికి 8 అవార్డులు దక్కాయి అంటే అది కేవలం పంచాయతీ కార్యదర్శుల కృషి మాత్రమే అని అన్నారు.
వచ్చే రెండు వారాల సమయంలో జెపిఎస్ ల క్రమబద్దీకరణ చేయని యెడల ఈ నెల 28 తేదీ నుండి సమ్మె కు వెళ్తామని పంచాయితీ కార్యదర్శులు తెలియపర్చారు. ఈ కార్యక్రమంలో ఎంపిఓ పద్మ అన్ని గ్రామ పంచాయితీ కార్యదర్శులు పాల్గొన్నారు.
సర్వీసును క్రమబద్ధీకరించాలని కోరుతున్న జేపియస్ లు
Related Posts
సూర్యాపేట లో నూతన డీఎస్పీ కార్యాలయం ప్రారంభం
SAKSHITHA NEWS సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : సూర్యాపేట జిల్లా కేంద్రంలో డీఎస్పీ కార్యాలయాన్ని ఐజి రమేష్ రెడ్డి ఐపీఎస్, IG సత్యనారాయణ ఐపీఎస్, జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవార్ ఐఏఎస్, జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్…
కబడ్డిలో రాష్ట స్థాయికి ఎంపిక అయిన తిరుమలపూర్ విద్యార్థి
SAKSHITHA NEWS కబడ్డిలో రాష్ట స్థాయికి ఎంపిక అయిన తిరుమలపూర్ విద్యార్థి కొడిమ్యాల: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం లోనితిర్మలాపూర్ ఉన్నత పాఠశాలకు చెందిన బోయిని శివమని ఉమ్మడి కరీం నగర్ జిల్లా స్థాయి అండర్ 14 కబడ్డీ పోటీ లో…