SAKSHITHA NEWS

జెనసేన బీజేపీ అలవెన్స్MLA అభ్యర్థి నేమూరి శంకర్ గౌడ్. తాండూరు టౌన్ లో వేల మంది కార్యకర్తలతో గాజు గ్లాస్ గుర్తుతో, విస్తృతముగా, పర్యటన ప్రచారం చేయడం చేశారు.

వికారాబాద్ జిల్లా తాండూర్(సాక్షిత న్యూస్ నవంబర్ 17) తాండూర్ పట్టణం లో బీజేపీ జెనసేన అభ్యర్థి నేమూరి శంకర్ గౌడ్ జెనసేన సైన్యం మరియు బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున సుమారుగా వేల మందితో తాండూర్ మార్పు కోసం,పని చేస్తానని ఇక్కడ కందులు నాన్యమైనవని ప్రపంచం కు తెలిసిన కంది బోర్డు తీసుకరాలేరు కనుక జెనసేన ను అదరించి, గాజు గుర్తు పైన ఓటు వేసి,గెలిపిస్తే కంది బోర్డు తీసుకొని వస్తా మన్నారు.బస్టాండ్ ఇరువైపుల రోడు సైడు దుకాణాల ప్రతి వ్యాపార యజమానులను కలువడం చేశారు. చైతన్య జూనీయర్ కళశాల నుండి శాంతిమహల్ టాకీస్, ఖాళీక దేవి అమ్మవారికి పూజలు నిర్వహించి తధనంతరం భద్రప్పగుడి నుండి గాంధీ చౌక్ వరకు వెళ్లి అటునుంచి కొత్త కూరగాయల మార్కెట్ వినాయక చౌక్, గంజి మార్కెట్ మొత్తం ఆర్తి దుకానాలు తిరుగడం జరిగినది.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ముఖ్యం గా తాండూర్ లో 5 సిమెంట్ ప్యాక్త్రీలుంట్ ఈ ప్రాంతా యువకులకు ఉద్యోగాలలో చేర్పించలేక పోవడం శోచనీయం కాదా, అని ప్రశ్నించారు ఇక్కడ పొల్యూషన్ కూడ ఎక్కువ ఉన్నది. BRS ప్రభుత్వం అవినీతి లో కూరుకు పోయింది,ప్రాజెక్టు ల పేరుతో లక్షల కోట్లు దోచుకున్నారని ప్రతి పక్ష నాయకులు రోజు అంటూనే వున్నారు, అందుకే కెసిఆర్ కు భయం పట్టుకుంది అంటున్నారు జనం. ప్రస్తుతం BRS మరియు కాంగ్రెస్ పార్టీలు కోట్ల డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ఐన కూడా తాండూర్ నియోజకవర్గం ఓటర్లు పైలెట్ రోహిత్ రెడ్డి ని గాని, మనోహర్ రెడ్డిని గాని నమ్మడం లేదన్నారు. ఎందు కంటే గతం లో రోహిత్ రెడ్డిని కాంగ్రెస్ నుండి MLA గా అభిమానించి నియోజకవర్గం ఓటర్లు Dr.P. మహేందర్ రెడ్డిని కాదని ఓడించి, పైలెట్ ను గెలిపిస్తే ఓటర్ల నోట్లో మట్టికొట్టి, అభివృద్ధి సాకుతో వారి సొంత కాంట్రాక్టుల కొరకుBRS పార్టీ లోనికి పోయినాడని ఈ ఓటర్లు అంటున్నారు,అదే BRS లో ఉన్న B. మనోహర్ రెడ్డి జిల్లా పదవులు అనుభవించి MLA టికెట్ ఇవ్వనందున కోట్ల డబ్బులకు కాంగ్రెస్ పార్టీ కి MLA టికెట్ కొన్నాడు కదా. వీరిద్దరిలో ఎవరు గెలిచిన మళ్ళీ, ఇతర పార్టీలలోనికి తప్పకుండా వెళ్లి పోతారు పార్టీ మారుతారు అని నియోజకవర్గం ప్రజలు అంటున్నారు. అందుకే ఒక సిద్ధాంతం, దేశం భక్తి, కల్గిన బీజేపీ నే బీసీ సీఎం నే ప్రకటించిన దమ్మున్న పార్టీ అలవెన్స్ తో జెనసేన MLA అభ్యర్థి శంకర్ గౌడ్ సరి యైన అభ్యర్థి అని ప్రజలు గ్రహించి అందరించు తాము అంటున్నారు. కనుక తప్పకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ జెనసేన వ్యవస్థాపక నాయకులు, వారు కూడా తాండూర్ వస్తారు. ముఖ్యం గా ఈ ప్రాంతం లో గుంతల మాయంగా ఉన్నాయి, ఎన్నికల సమయంలో విల్యామున్ చౌరస్తా హైదరాబాద్ రోడు మార్గం లో రోడు వేస్తున్నారు. వాహనాలు పోవడానికి వాహనదారులు ఎంత భాధ పడుతున్నారు, బండి ట్యాక్స్ కట్ట లేదాని పోలీస్లు పైన్ వేస్తారు, రోడు బాగా లేకుంటే పైన్ ఎందుకు కట్టాలి? అని ప్రజలు అడుగుతున్నారు. ఇక పోతే తెలంగాణ BRS ప్రభుత్వం, ఉద్యమ కారుల భలి దానలతో వచ్చింది, కెసిఆర్ ఒక్కడే తెచ్చిండు అని ఉద్యమ ద్రోహులు, కెసిఆర్ భజన పరులు అనుంటారు చిత్రంగా ఉంటది, వాళ్ళ మాటలు, అసలు ఉద్యమ కారులను ఎప్పుడో మరిచినది brs ప్రభుత్వం, మద్యం కారులను తయారు చేస్తున్నది. చిన్న చిన్న పోరగాళ్ళు కూడ వైన్స్ల దగ్గర మందుకొంటున్నారు, వైన్స్ శాపుల వారు ఇస్తున్నారు, ఆధార్ కార్డు చూసి 22 సంవత్సరాలు ఉంటేనే ఇవ్వాలికదా, ఎప్పటినుండి జెనసేన చెప్పుతున్నదన్నారు, ఈ ప్రచారం లో యు. రమేష్ కుమార్ బీజేపీ జిల్లా ప్రధాన కార్య దర్శి సినీయర్ నాయకులు భాలి శివకుమార్, అసెంబ్లీ ఇంచార్జి రవీందర్, పట్టణ బీజేపీ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, మాజీ కౌన్సిలర్ కృష్ణ ముదిరాజ్,తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS