SAKSHITHA NEWS

గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఫ్లెక్సీలను ధ్వంసం చేయటం జరిగింది..

జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గెలుపు సంబరాలను అందరూ ఆనందించాలనే ఉద్దేశంతో గుంటూరు నగరంలో జనసేన నాయకులు దార్ల మహేష్ ఎన్టీఆర్ సర్కిల్ నుంచి మాయాబజార్ మీదగా హిమనీ కూడలిలో మరియు హిందూ కాలేజ్ సిగ్నల్ వరకు భారీ ఫ్రేములను తయారుచేసి కొణిదెల పవన్ కళ్యాణ్ ఉన్న ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలను భారీగా ఏర్పాటు చేయడం జరిగింది..

కానీ కొంతమంది దుండగులు కావాలనే ఉద్దేశంతో, ఉద్దేశపూర్వకంగా పవన్ కళ్యాణ్ ఫోటో ఉన్నటువంటి ఫ్లెక్సీలను మా మనోభావాలను దెబ్బతీసే విధంగా వాటిని చింపడం జరిగింది…

మంచిదే ఫ్లెక్సీలు చింపే ఆట మీరు మొదలుపెట్టారు భవిష్యత్తులో మేము కూడా కచ్చితంగా ఆట కొనసాగిస్తాం..

కానీ ఫ్లెక్సీలు చింపటమేనా దమ్ముంటే అదే ప్లేస్ లో మేము నిలబడతాం దమ్ముంటే రండి చూద్దాం..
బలాబలాలు కూడా తేల్చుకుందాం…

ఫ్లెక్సీ చింపి మిరుపొందే శునకనాదం మమల్ని సమాజంలో ప్రజల మనసులో మా విలువను రెట్టింపు చేశాయేగని , తగ్గించలేదు .

మీ ఆలోచనావిధానం 10 ఏళ్ళ లోపు పిల్లవాడి ఆలోచనకు సరిపోతుంది . పిల్లవాడి నాన్న చాక్లెట్ కొనివ్వలేదు అని వాళ్ళ నాన్న జేబులో ఉన్న 100 నోటు చించినప్పుడు ఆ నోటు విలువ ఆ పిల్లవాడికి అప్పుడు తెలీదు . అలాఉంది మీ ఆలోచన.

ఫ్లెక్సీలు చింపినట్టువంటి విషయాన్ని గుంటూరు జిల్లా పోలీస్ ఉన్నతాధికారి ఎస్పీ ని కలిసి పైన జరిగిన విషయాన్ని తెలియజేయటం జరిగింది..
అలాగే కొత్తపేట సీఐ ని కలవడం లాలాపేట సిఐ ని కూడా కలిసి చింపిన వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని
ఫిర్యాదు చేయడం జరిగింది..
ఈ విషయాన్ని ఇంతటితో వదలకుండా పోలీస్ అధికారులు చింపిన వ్యక్తులను గుర్తించి అరెస్ట్ చేయని పక్షంలో జనసేన జెండాలను భుజాల మీద వేసుకొని గుంటూరు తూర్పు నియోజకవర్గం జనసేన పార్టీ కార్యకర్తల బలాన్ని చూపిస్తాం.. పాడి సాంబశివరావు నాయుడు జనసేన పార్టీ గుంటూరు తూర్పు నియోజకవర్గం నాయకులు

గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఫ్లెక్సీలను

SAKSHITHA NEWS