SAKSHITHA NEWS

జమిలి ఎన్నికలు రాష్ట్రల స్వయం ప్రతిపత్తికి అఘాతం.
సీపీఐ జాతీయ సమితి సభ్యులు సభ్యులు యూసుఫ్.

జమిలి ఎన్నికలు,హైడ్రా పని తీరు పై,నియోజకవర్గంలో అధికార ప్రతిపక్ష సభ్యుల మాటల యుద్ధం పై నేడు శపూర్ నగర్ ఏఐటీయూసీ కార్యాలయం నుండి పత్రిక ప్రకటన విడుదల చెయ్యడం జరిగింది.
ఈ సమావేశంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు స్వామీ,నియోజకవర్గ కార్యవర్గ సభ్యుడు శ్రీనివాస్ లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మోడీ ఒకే దేశం ఒకే ఎన్నికలు అనే ఒక ప్రజా ఆకర్షణ గల నినాదం ఊపయోగించి ప్రజలను అసలు అంశాల నుండి దృష్టి మరల్చి రాష్ట్రాలకు గల స్వయం ప్రతిపత్తిని తీసివేయ్యడానికి, ఎన్నికలు జరగాల్సిన రాష్ట్రాలకు ఎన్నికలు జరపకుండా ఆయా రాష్ట్రాలను తమకు ఇష్టమైన వారిని గవర్నర్ గా నియమించుకొని,సీబీఐ,ఈడీ లాంటి సంస్థలను ఉపయోగించి ప్రతిపక్ష పార్టీల నాయకులను ఇబ్బందికి గురిచేసి ఈ దేశాన్ని నియంతృత్వంలోకి మార్చే ప్రమాదం ఉందని కావున మేధావులు, యువకులు, ప్రజలందరూ వీటిని వ్యతిరేకించాలని కోరారు. చంద్రబాబు, నితీష్ కుమార్లు ఎక్కడ గద్దె దింపుతారోననే భయంతో జమిలి ఎన్నికల ప్రతిపాదన తీసుకువచ్చారని విమర్శించారు. గతంలో ఒకే దేశం ఒకే పన్ను పేరుతో రాష్ట్రాల నుండి పన్ను వసూళ్లు అధికారం లాకొన్ని ఇవ్వాళ రాష్ట్రాలకు రావలసిన పన్నులను అడ్డుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. ఈ నినాదాలు కేవలం వారి అధికారం నిలుపుకోవడం కోసం,తమ పెట్టుబడిదారులకు ఉపయోగమే కానీ ప్రజలకు మాత్రం ఉపయోగం లేదని అన్నారు.

 హైడ్రా పని తీరు

చెరువులు, కుంటలు, పార్కులు, ప్రభుత్వ భూములు కాపాడటానికి ఏర్పడిన హైడ్రా ప్రారంభంలో బాగా పనిచేసిందని, ప్రజల నుండి కూడా మద్దతు పొందిందని, దానికి సీపీఐ పార్టీ కూడా మద్దతు తెల్పిందన్నారు,కానీ మన నియోజకవర్గంలో మాత్రం కేవలం కొన్ని ప్రాంతాలో మాత్రమే కూల్చివేసి, పేద ప్రజలు ఇబ్బంది పడుతున్న ప్రాంతంలో ఉన్న చెరువుల కబ్జాను మాత్రం పట్టించుకోలేదని అన్నారు.కేవలం చెరువులు మాత్రమే అనడం వల్ల ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నాయని,ఆ కబ్జాలను గతంలో రాష్ట్ర ప్రదాన కార్యదర్శి నుండి వచ్చిన ఆదేశాలు కూడా అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు. కబ్జాదారుల నుండి మోసపోయిన వారికి కబ్జాదారుల నుండి నష్టాన్ని వసూలు చేసి వాటికి కారణమైన కబ్జాలు అవుతున్నపటికి అలసత్వం వహించిన రెవెన్యూ అధికారులను,అక్రమంగా ఎలక్ట్రిక్ మీటర్లు ఇచ్చిన ఎలక్ట్రిక్ అధికారులను,ఇతర సదుపాయాలు కల్పించిన ప్రభుత్వ అధికారులను తక్షణమే సస్పెండ్ చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.వీటి వెనుకాల ఉన్న రాజకీయ నాయకులను కూడా అరెస్టు చెయ్యాలని అన్నారు.

నియోజకవర్గంలో అధికార,ప్రతిపక్ష నాయకుల మాటల యుద్ధం
గత మూడు రోజులుగా నియోజకవర్గంలో అధికార,ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై మరొకరు విమర్శించుకుంటు,రాజకీయాలు కలుషితం చేస్తున్నారని,2009 కి పూర్వం అధికారంలోకి వచ్చినప్పుడు వారికి ఉన్న ఆస్థి ఎంత,ఇప్పుడు వారి ఆస్థి ఎంత అది ఎలా సంపాదించారు అని చెపితే ప్రజలు కూడా స్వాగతిస్తారని,సీపీఐ కూడా స్వాగతిస్తామని,అలాగే రెండు ప్రభుత్వాల హయాంలో జరిగిన భూకబ్జాలు, అన్యాక్రాంతం అయిన ప్రభుత్వ భూమి, చెరువులు, కుంటలు,పార్కులు ఎన్ని లెక్కలు తీసి వాటిలో ఎవరికి లాభం చేకూరిందో చెపితే బాగుంటుందన్నారు. ఇరు పక్షాలు మీరు తప్పు చేశారంటే మీరు చేశారని అనడం వల్ల ప్రజల సమస్యలు పక్కదారిన పడుతున్నాయని,కావున అందరం కలిసి నియోజకవర్గ అభివృద్ధి కోసం పని చేద్దామని అన్నారు.
మన నియోజకవర్గనికి మంజూరు అయ్యిన గురుకుల కళాశాల,మెడికల్ కళాశాల ఇతర ప్రాంతాల్లో నడుస్తున్నాయని వాటి కోసం స్పందించి ఇక్కడికి రప్పించేలా,బస్తి దవాఖానలో మందులు లేక,పరిశుభ్రమైన మంచి నీరు రాక,రోడ్లు గుంతలు పడటం వల్ల,ఇతరత్రా అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని కావున వాటి కోసం తక్షణమే స్పంధించి సమస్యలను పరిష్కరించడానికి పని చెయ్యాలని కోరారు.


SAKSHITHA NEWS