రైతు వ్యతిరేక కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి
24 గంటల ఫ్రీ కరెంట్ ఎత్తేయడమే కాంగ్రెస్ పాలసీ
కాంగ్రెస్ ది దుర్మార్గమైన ఆలోచన
3 పంటల బీఆర్ఎస్ కావాలా..? కటిక చీకట్ల కాంగ్రెస్ కావాలా?
అన్నదాతను అవమానిస్తున్న కాంగ్రెస్
కన్ను కొట్టి..కక్ష కట్టారు
కాంగ్రెస్ హయాంలో పవర్ హాలిడేలు.. క్రాప్ హాలిడేలే…
మీటర్లు పెట్టాలన్నా..మేము ఒప్పుకోలేదు
కేసీఆర్ వల్లే దండగన్న వ్యవసాయం పండుగైoది
కేసీఆర్ నాయకత్వంలోనే రైతు రాజ్యం
కాంగ్రెస్ పై బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు
మండిపాటు
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ అని, వ్యవసాయానికి 24 గంటల కరెంట్ వద్దు.. 3 గంటల కరెంట్ చాలన్నదే ఆ పార్టీ విధానమని స్వయంగా పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రకటించడం ద్వారా ఆ పార్టీ అసలు రంగు తేట తెల్లమైందని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు కాంగ్రెస్పై మండి పడ్డారు. ఈ మేరకు ఎంపీ నామ సోమవారం ఇక్కడ పత్రికా ప్రకటన విడుదల చేశారు.రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అవసరమే లేదు.. ఫ్రీ కరెంట్ ఎందుకు ఇవ్వాలి అని.. అనేక మంది కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే మాట్లాడు తున్నారని అన్నారు.
ఉచిత విద్యుత్ రద్దు చేయడం.. 24 గంటల కరెంట్ ఎత్తేయడమే కాంగ్రెస్ పాలసీ అని తేలిపోయిందన్నారు. మూడు గంటల కరెంట్ చాలు అంటూ.. మూడు రంగుల కాంగ్రెస్ తన రైతు వ్యతిరేక బుద్ధిని బయటపెట్టుకుందని నామ ధ్వజమెత్తారు.
ఆనాడు ఆగమైపోయిన అన్నదాత .. మళ్లీ ఇప్పుడే తేరుకొని ఆనందంగా ఉన్నాడు..24 గంటల కరెంట్ వద్దూ ..3 గంటల కరెంట్ చాలూ అంటూ .. దుర్మార్గమైన ఆలోచనను బయటపెట్టింది కాంగ్రెస్ అన్నారు. మూడు పంటల బీఆర్ఎస్ కావాలా..? మూడు గంటల కాంగ్రెస్ కావాలా..? తెలంగాణ రైతాంగం తేల్చుకోవాలన్నారు.
కరెంట్ వెలుగుల బీఆర్ఎస్ వుండాలా..? కటిక చీకట్ల కాంగ్రెస్ కావాలా..? రైతన్నలు ఆలోచన చేయాలని నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు.
గతంలో చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగ అన్నారు… ఇప్పుడు ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి కరెంట్ దండగ అంటున్నడని చెప్పారు.
తెలంగాణలో అంతా 3 ఎకరాల్లోపు చిన్న .. సన్న రైతులే ఉన్నారని, వాళ్లకెందుకు 24 గంటల పవర్ అంటూ అహంకారంతో.. అన్నదాతను అవమానించేలా మాట్లాడుతున్నది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. 24 గంటల నిరంతర విద్యుత్ తో 30 లక్షల బోర్లు బావుల కింద పంటలు పుట్లకొద్ది పంటలు పండించుకుంటున్న రైతుల్ని చూసి కాంగ్రెస్ పార్టీకి కన్ను కుట్టి.. కక్ష కట్టిందన్నారు.కరెంట్ వెలుగుల్ని మింగేసి కటిక చీకట్ల కాలాన్ని మళ్లీ తీసుకొస్తా నంటున్నదని పేర్కొన్నారు. పచ్చబడుతున్న రైతుపై పగబట్టిందన్నారు.
కాంగ్రెస్ హయాంలో ఒత్తులేసుకోని పడ్డ కరెంట్ కష్టాలను.. ఎట్ల మర్చిపోతం..! కరెంట్ ఎప్పుడొస్తదో తెల్వక కళ్లల్లో మడి తడుపుకోడానికి రాత్రుళ్లు జాగారం చేసి.. నిద్రలు లేక అన్నదాత అరిగోసలు పడ్డారని అన్నారు. ఏనాడూ 3-4 గంటలు మించి వ్యవసాయానికి కరెంట్ ఇచ్చిన పాపాన పోలేదు..! -ఆనాడు యాడ చూసినా కాలిపోయే మోటర్లు.. పేలిపోయే ట్రాన్స్ ఫార్మర్లు.. కరెంట్ కోసం రైతుల ధర్నాలు.. సబ్ స్టేషన్ల మీద దాడులే కనిపించేవని నామ స్పష్టం చేశారు.
-అర్ధరాత్రి.. అపరాత్రి.. దొంగరాత్రి ఇచ్చే కరెంట్ చీకట్లో మోటర్లు పెట్టడానికి పోయి.. కరెంట్ షాకులు కొట్టి.. పాములు , తేళ్లు కుట్టి వేలమంది రైతన్నలు మృత్యువాత పడ్డారు..! చేల గట్ల మీద మరణ మృదంగం మోగింది..! కాంగ్రెసోళ్ల కరెంట్ వేల కుటుంబాలను చిదిమేసింది.. చీకట్లు నింపిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రాజ్యంలో పవర్ హాలీడేలు. క్రాప్ హాలీడేలేనని అన్నారు.
కరెంట్ కోతల కాంగ్రెస్ పాలనలో పంటలు ఎండి.. రైతు కంట కన్నీరు కారిందన్నారు. అప్పులు
తెచ్చివేసిన పంటలు ఎండిపోయి.. అన్నదాతలు
మృత్యుకేకలతో.. ఇంటింటా శోకాలే ఆనాడు అని అన్నారు.ఆనాడు
కల్తీ విత్తనాలు , కల్తీ పురుగు మందులతో కర్షకుడు పడ్డ కష్టాలు చెప్పనలవి కాదన్నారు. కాంగ్రెస్ రైతును రాచి రంపానపెట్టిందన్నారు.
కరెంట్ కోతలతో కాల్చుకు తిన్నది. కాంగ్రెస్..! తెలంగాణ రైతుపై విద్యుత్ చార్జీల పిడుగువేసిన తెలుగుదేశం నిర్ణయానికి నిరసిస్తూ లేఖరాసి..నీళ్లు.. నిధులు.. నియమకాల దోపిడి నుంచి విముక్తి కోసం కరెంట్ కష్టాలకు శాశ్వతంగా చరమగీతం పాడాలని తెలంగాణ ఉద్యమ జెండా ఎత్తుకున్నడు కేసీఆర్ అని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత.. ఎద్దేడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని..
సాగు రంగాన్ని సంక్షోభంలో నుంచి బయటపడేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చి, ఎన్నెన్నో విప్లవాత్మక పథకాలు తీసుకొచ్చిందన్నారు.9 ఏండ్లలో రైతుల మేలుకోసం నాలుగున్నర లక్షల కోట్లను ఖర్చు చేసి.. సరికొత్త చరిత్ర సృష్టించింది కేసీఆర్ సర్కారు అన్నారు.బోర్ల మీద ఆధారపడి వ్యవసాయం చేసుకునే రైతుకు కరెంట్ ప్రాణావసరం అని గుర్తించి.. వేల కోట్లు వెచ్చించి..24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం అన్నారు. దేశంలో వ్యవసాయానికి
24 గంటల నాణ్యమైన ఫ్రీ కరెంట్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగణ అన్నారు.ఇప్పుడు తెలంగాణలో కాలిపోయే మోటర్లు లేవు.. పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు లేవ్..! ఎన్ని గంటలు మోటర్లు నడిచినా పైసా బిల్లులేదు..! కాల్వల మీద ఎన్ని మోటర్లు పెట్టి నీళ్లు తోడుకున్నా.. రైతుకు అడ్డుచెప్పే ప్రశ్నేలేదన్నారు. ఉచిత విద్యుత్ కోసం తెలంగాణా ప్రభుత్వం ఏటా 12వేల కోట్లు ఖర్చు చేస్తున్నదని చెప్పారు. కటిక చీకట్లు తొలిగి.. విరామం లేని 24 గంటల విద్యుత్ వెలుగు జిలుగులతో అన్నదాత ఆనందంగా వున్నడని అన్నారు.
మోటార్లకు మీటర్ల బెదిరింపు
కేంద్ర ప్రభుత్వం మోటర్లుకు మీటర్లు పెట్టాలని మెడమీద కత్తిపెట్టి రుణాలు ఇవ్వమని బ్లాక్ మెయిల్ చేసినా కేసీఆర్ బెదరలేదన్నారు. 30వేల కోట్లను వదులుకున్నాం తప్ప.. ఉచిత కరెంట్ పై రాజీపడలేదని నామ చెప్పారు.
దండగన్న వ్యవసాయం పండుగైoది
కాళేశ్వరం.. మిషన్ కాకతీయ.. ఇతర ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణలో ఎక్కడ చూసిన నీళ్లే కనిపిస్తున్నాయన్నారు. కడుపునిండా ఇస్తున్న కరెంట్తో .. పుష్కలంగా పెరిగిన భూగర్భ జలాలను వాడుకొని 30 లక్షల బోర్లుకింద రైతులు దండిగా పంటలు పండిస్తున్నరని తెలిపారు. నాడు దండగన్న వ్యవసాయం నేడు తెలంగాణా లో పండుగైందని, నాటి ఆకలికేకల తెలంగాణ నేడు దేశానికే అన్నపూర్ణగా అవతరించిం దన్నారు.రాబందుల కాలం పోయి.. రైతు బంధువుల రాజ్యం వచ్చిందన్నారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణమైందన్నారు.
వరి ఉత్పత్తిలో ఎక్కడో 14వ స్థానంలో వున్న మనం.. ఇప్పుడు దేశంలోనే ప్రథమ స్థానానికి చేరుకున్నామని చెప్పారు.పంజాబ్ ను తలదన్ని ఎఫీసీఐకి ధాన్యాన్ని ఇచ్చే రాష్ట్రాల్లో టాప్ ప్లేస్ లో కూర్చున్నామని చెప్పారు.
రైతు బంధు చరిత్ర
ఎకరానికి ఏడాదికి 10వేల పంట పెట్టుబడి ఇచ్చే రాష్ట్రం ప్రపంచంలో తెలంగాణ ఒక్కటేనని, 11 విడతల్లో…70 లక్షల మంది రైతుల ఖాతాల్లో.. 73 వేల కోట్లు వేసిన స్టేట్ ఈ దేశంలో ఇంకొకటి లేదన్నారు. ఇదో రికార్డ్ అన్నారు.
గుంట భూమి వున్న రైతు జీవితానికి దీమా ఇస్తున్నది రైతు బీమా..! దురదృష్టవశాత్తు చనిపోయిన లక్ష్మ మందికిపైగా రైతుల కుటుంబాలను రోడ్డున పడకుండా ఆదుకుంటున్నదీ ఈ పథకం అన్నారు.ఇందుకోసం రూ.5,300 కోట్లకు పైగా ప్రీమియం చెల్లించింది ప్రభుత్వం అన్నారు.
చెరువుల,ప్రాజెక్టులకు జీవం
-ధ్వంసమైపోయిన 46,500కు పైగా చెరువులు.. కుంటలు మళ్లీ జీవం పోసుకున్నా యన్నారు. రూ.9000
కోట్లకుపైగా నిధుల మిషన్ కాకతీయ పథకంతో బాగుపడ్డ చెరువులు.. మండే ఎండల్లోనూ మత్తళ్లు దుంకుతున్నాయని అన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం అని, ఈ ప్రాజెక్టు తెలంగాణ జీవనాడి అన్నారు. కరువును శాశ్వతంగా తరిమికొట్టే వరమన్నారు. పాలమూరు.. రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తైతున్నది..! శ్రీరాంసాగర్ కు పునరుజ్జీవం వచ్చిందన్నారు. సీతారామా, సీతమ్మ సాగర్ .. తుపాకుల ఎన్నో జలాశయాలు వడివడిగా సిద్ధమౌతు న్నాయన్నారు. గూడెం సమ్మక్క బరాజ్.. డిండి.. ఇంకా
పెండింగ్ ప్రాజెక్టులకు మోక్షం దొరికిందన్నారు. బీడు భూముల్లో కృష్ణా గోదావరి జలాలు పారించడానికి ..9 ఏండ్లలో లక్షా 70 వేల కోట్లకుపైగా ఖర్చు చేసి సాగునీటి ప్రాజెక్టులను చకచకా పూర్తి చేసింది తెలంగాణ ప్రభుత్వం అన్నారు. కాంగ్రెస్ పార్టీ వేసిన వందల కేసుల్ని.. వేల అడ్డంకులను అధిగమించి ధృఢ సంకల్పంతో ప్రాజెక్టులను నిర్మించడం జరిగిందని అన్నారు. 7 వేలకు పైగా కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతు పండించిన ప్రతి గింజను కొంటున్న ఏకైక రాష్ట్రo తెలంగాణ మాత్రమేనని అన్నారు.దేశంలో రైతు కోసం కేసీఆర్ లా తపించిన నాయకుడు లేడన్నారు. తెలంగాణలో వున్న ఉత్తమ వ్యవసాయ విధానాలు ఏ రాష్ట్రంలోనూ లేవన్నారు. మనం పెట్టిన ప్రతి పథకాన్ని.. ఎన్నో రాష్ట్రాలు ..కేంద్రం కాపీ కొట్టాయని నామ నాగేశ్వరరావు వివరించారు.