రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో సొంత గృహాలు లేని పేద ప్రజలకు జగనన్న కాలనీలు ఏర్పాటు చేసి వాటిలో ఇంటి స్థలాలు మంజూరు చేసిన నేపథ్యంలో గుంటూరు నగరంలో పేద ప్రజల కోసం ఏర్పాటు చేసిన కాలనీలైన అనంతవరప్పాడు మరియు కొర్నెపాడు లే- అవుట్ల యందు మౌళిక వసతుల కల్పనకు క్షేత్ర స్థాయిలో పర్యటించి,స్థలాలను మరియు వాటి తాలూకు మ్యాప్ లను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్న గుంటూరు నగర పాలక సంస్థ మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు MLA మద్దాళి గిరిధర్
ఈ సందర్బంగా వారిరువురు మాట్లాడుతూ,
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా సొంత గృహాలు లేని పేద ప్రజలకు సొంతింటి కల నెరవేర్చుటకు రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షలకు పైగా ఇంటి స్థలాలను మంజూరు చేశారన్నారు.
భారతదేశంలో ఎక్కడా లేని విధంగా సొంత ఇల్లు లేని ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు నిర్మించిన ఇచ్చుటకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిచ్చయంతో ఉందన్నారు.
గుంటూరు నగరంలో తూర్పు,పశ్చిమ మరియు పత్తిపాడు నియోజకవర్గాలకు సంబంధించి సుమారు 67,781 ప్లాట్లను పంపిణీ చేశారన్నారు.
ఈ ప్లాట్లలో ప్రజలకు అవసరమయ్యే అన్ని మౌళిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామని,కొన్ని లే అవుట్లలో గృహ నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి అన్నారు.
అనంతవరప్పాడు లే-అవుట్ నందు సుమారు 6387 ప్లాట్లను మరియు కొర్నెపాడు లే-అవుట్ నందు సుమారు 14658 ప్లాట్లను నగర ప్రజలకు అందజేయడం జరిగిందన్నారు.
సదరు ప్లాట్లలో జంగిల్ క్లియరెన్స్ రోడ్లు మరియు త్రాగునీరు వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయుట జరుగుతుందన్నారు.
ఇంటి స్థలాలు పొందిన లబ్ధిదారులు వారి స్థలాల్లో ప్రభుత్వం నిర్దేశించిన విధంగా గృహ నిర్మాణాలు చేపట్టాలాన్నారు.
భవిష్యత్ లో జగనన్న లే-అవుట్లు ఎంతగానో అభివృద్ధి చెందుతాయని,సదరు ప్రాంతాలలో అవసరమైన వైద్యశాలలు,కమ్యూనిటీ హాళ్లు మరియు పాఠశాలలు నిర్మించుట జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ SE భాస్కర్ రావు,సిటీ ప్లానర్ ప్రదీప్ కుమార్,EE కోటేశ్వరరావు,DEEలు,AEలు,సచివాలయాల కార్యదర్శులు పాల్గొన్నారు.