చిన్నారి ఆరోగ్యానికి జగనన్న భరోసా… MLA శిల్పా రవి రెడ్డి
సాక్షిత : నంద్యాల మూలమట్టం సమీపంలో నివాసం ఉంటున్న చిన్నారి పావని కి చికిత్సకయ్యే పూర్తి ఖర్చు సీఎం రిలీఫ్ ఫండ్ నుండి మంజూరు చేయడం జరుగుతుందని, సీఎం ఆదేశాల మేరకు తక్షణ సహాయంగా చిన్నారికి జిల్లా కలెక్టరు డా. మనజీర్ జిలాని సామున్ , MLA శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి,వార్డు కౌన్సిలర్ పురందర్ కుమార్ చేతులమీదుగా చిన్నారి పావని కుటుంబ సభ్యులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు …
ఈ సందర్భంగా నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాలకు చెందిన చిన్నారి పావని గతంలో ప్రమాదవశాత్తు పాఠశాల వద్ద కిందపడి పక్షవాతం రావడంతో అప్పటి నుండి అచేతనంగా ఉన్నది. మెరుగైన చికిత్స కొరకు చిన్నారి తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించడం జరిగింది. ఆర్ధిక పరిస్థితి బాగోలేక పోవడంతో సాయం కోసం నన్ను సంప్రదించడం జరిగింది.
సోమవారం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో నిర్వహించిన రైతు భరోసా కార్యక్రమం అనంతరం… చిన్నారి పరిస్థితిని సీఎం దృష్టికి తీసుకు వెళ్లగా వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవ తీసుకుని, చిన్నారి పావని ఆరోగ్య రక్షణకు భరోసా కల్పిస్తూ..వైద్య ఖర్చులకు తక్షణ సహాయంగా లక్ష రూపాయలు అందించే ఏర్పాటు చేశారు. మెరుగైన వైద్యానికి అయ్యే పూర్తి ఖర్చు సీఎం రిలీఫ్ ఫండ్ నుండి మంజూరు చేయనున్నట్లు తెలిపారు. చిన్నారి ఆరోగ్యం పై పూర్తి భరోసా కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్నకు చిన్నారి పావని కుటుంబ సభ్యుల తరఫున ప్రతేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వెంకట దాసు, మాజీ కౌన్సిలర్ భీమినిపల్లి వెంకటసుబ్బయ్య, వైఎస్ఆర్ సీపీ నాయకులు జనార్దన్ రెడ్డి, దేశం సుధాకర్ రెడ్డి, పోలూరు మహేశ్వరరెడ్డి,బుగ్గారెడ్డి,మాజీ కౌన్సిలర్ అనిల్ అమృతరాజ్, జాకీర్ హుస్సేన్ ,తదితరులు పాల్గొన్నారు