మా నమ్మకం నువ్వే జగన్

Spread the love

మా నమ్మకం నువ్వే జగన్
చెప్పాలంటే… చేస్తాడంతే
జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం నిర్వహించిన డాక్టర్ శిరీష


సాక్షిత : తిరుపతి నగర పాలక సంస్థ పరిధిలోని 27వ డివిజన్ లో ఉదయం మల్లయ్య గుంటకట్ట మొదలగు ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్తూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, నగర అభివృద్ధిపై మీరు సంతృప్తిగా ఉన్నారా. అంటూ ప్రజలతో మమేకమయ్యారు.
డివిజన్ లో మేయర్ ప్రతి ఇంటి ఇంటి కి వెళ్లి లబ్ధిదారులతో మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కరూ జగనన్న లబ్ధి పొందామని సంతృప్తి వెలబుచ్చడం జరిగింది.
ప్రతి ఇంటికి మరియు వారి మొబైల్ కు జగనన్న స్టిక్కర్ అంటించమని వారి కోరినారు.
మేయర్ మీడియాతో మాట్లాడుతూ మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం నేటి నుండి ప్రారంభించడం జరుగుతుంది అని ఈ కార్యక్రమం 14 రోజులు పైన జరుగుతుంది అని లబ్ధిదారులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం తెలియజేశారు.
చెప్పాడంటే.. చేస్తాడంటే.


మాట మీద నిలబడే వ్యక్తిగా ఇప్పటికే జగనన్న మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98% నెరవేర్చాడని తెలిపారు.
జగనన్న కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడమని”ప్రతి ఒక్కరికి లబ్ధి పొందే విధంగా ప్రణాళిక రూపొందించారని తెలిపారు. నగర ప్రజలు కూడా 2024 లో కూడా జగనన్ననే ముఖ్యమంత్రి చేస్తామని ప్రజలు కోరుకుంటున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వై.యస్.ఆర్.సి.పి నాయకులు భరణి యాదవ్, తులసి యాదవ్, ఈతమాకుల సురేష్, చింత రమేష్, గీతా యాదవ్, వెంకట ముని, గృహ సారుదులు, కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page