జబ్బార్ కుటుంబానికి అండగా ఉంటాం
కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ రోజు ములుగు మండలం జగ్గన్న పేట గ్రామానికి చెందిన
ములుగు ఎమ్మెల్యే సీతక్క వ్యక్తిగత సహాయకుడు కొట్టెం వెంకట్ నారాయణ (జబ్బార్) ఇటీవలే బైక్ ప్రమాదం లో మరణించగా దశ దిన కర్మకు హాజరై వారి కుటుంబాన్ని పరామర్శించి ఆయన చిత్ర పటం వద్ద నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 10 ఏండ్లుగా నాకు వెన్నంటి ఉండి నా వ్యక్తి గత సహాయకుడిగా పని చేసి అకాల మరణం చెందిన వెంకట్ నారాయణ (జబ్బార్) నాకు కాంగ్రెస్ పార్టీ కి తీరని లోటని జబ్బార్ కుటుంబానికి అండగా ఉంటామని వారి అకాల మరణానికి చింతిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూన్నట్లు
జబ్బార్ కూతురి పేరు మీద ఫిక్స్ డిపాజిట్ 5 లక్షలతో పాటు వారి కూతురికి చదువు కునేందుకు మొత్తం కర్చు నేనే బారిస్తనాని సీతక్క అన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ తో పాటు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎంపీపీ, జెడ్పీటీసీ,సర్పంచులు ఎంపీటీసీలు సహకార సంఘం చైర్మన్ లు కాంగ్రెస్ పార్టీ ములుగు నియోజక వర్గ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు