రాష్ట్ర చరిత్రలో ఇది చీకటి రోజు : వైపాలెం టిడిపి నాయకులు
శాసనసభ లో వైసీపీ ఎమ్మెల్యే లు రౌడీముకలు మాదిరిగా టీడీపీ ఎమ్మెల్యే డోల బాల వీరంజనేయ స్వామి మీద దాడి చేయడం దారుణం అని, ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు యర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు.
రాష్ట్ర ప్రజలు పరిపాలన దేవాలయంగా శాసనసభ ను భావిస్తారు. అలాంటిచోట ప్రజలు ఎన్నుకొన్న ఎమ్మెల్యే మీద దాడి చేసి వైసీపీ సిద్ధాంతం ఏంటో చెప్పకనే చెప్పారు.
అసెంబ్లీ చరిత్రలోనే ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదు. రాష్ట్ర చరిత్రలో ఇది చీకటి రోజుగా మిగిలిపోతుంది.
ముఖ్యమంత్రి ప్రోద్భలంతోనే ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారు. ఒక వ్యూహం తోనే దళిత టీడీపీ ఎమ్మెల్యే మీద దాడి చేశారు.
తమ ఎమ్మెల్యేలే మా ఎమ్మెల్యే మీద దాడి చేసి మేము దాడి చేసినట్లు వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. సీసీ ఫుటేజీ తీస్తే ఎవరు ఎవరిపై దాడి చేశారనేది స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుందని తెలిపారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలలో టీడీపీ ఘన విజయం సాధించడం ఓర్వలేక ఇలా పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు.
ప్రజలు అన్ని గమనిస్తున్నారు, మీకు సరైన సమయంలో తగిన బుద్ధి చెబుతారని నాయకులు తెలిపారు.
కార్యక్రమంలో కంచర్ల సత్యనారాయణ గౌడ్, మంత్రు నాయక్, అచ్యుత్ రావు, వెంగల్ రెడ్డి, మహేష్ నాయుడు, పట్టణ అధ్యక్షులు షేక్ మస్తాన్ వలి, కాకర్ల కోటయ్య, వెంకటరావు గౌడ్, ఇస్మాయిల్, సేవ్యా నాయక్ చేదూరి లక్ష్మయ్య, పాలడుగు వెంకట కోటయ్య, పోక సుబ్బయ్య, జాగర్లమూడి గాలయ్య, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.