It is a matter of pride that Jogulamba Gadwala district has been selected for the National Inspire Awards
జాతీయ ఇన్స్పైర్ అవార్డులలో జోగులాంబ గద్వాల జిల్లా ఎంపిక కావడం గర్వించదగ్గ విషయం అన్న జిల్లా కలెక్టర్
కలెక్టర్ చాంబర్ లో మన తెలంగాణా రాష్ట్రం నుండి ఎంపికైన పి. దీపిక (మంటెస్సరీ స్కూల్ అలంపూర్ నుండి ఎంపిక అయినందున అభినందించారు. సెప్టెంబర్ 14,15,16 తేదిలలో డిల్లి లో ప్రగతి మైదాన్ లో నేషనల్ లెవెల్ ఎగ్జిబిషన్స్ అండ్ ప్రాజెక్ట్ కంపిటిషన్-ఇన్స్పైర్ అవార్డులకు ప్రదర్శన జరిగిందని , ఢిల్లీలో ప్రదర్శనకు తెలంగాణా రాష్ట్రం నుండి 8 ఇన్స్పైర్ ప్రాజెక్టులు రాష్ట్రంలోని ఎనిమిది పాఠశాలలకు చెందిన విద్యార్థులు జాతీయ స్థాయి అవార్డులు అందుకున్నారు
. మన రాష్ట్రం నుండి 37 ఇన్స్పైర్ ప్రాజెక్టులు పాల్గొన్నాయి. కంపిటి షన్లో మొత్తం 60 ప్రాజెక్టుల ప్రదర్శనలు నేషనల్ అవార్డుకు ఎంపిక కాగా.. దాంట్లోమన రాష్ట్రం నుంచి 8 ఇన్ స్పైర్ ప్రాజెక్టులు ఉన్నాయని, అందులో మన జిల్లా నుండి పి. దీపిక సైంటిఫిక్ బ్యాగ్ అనే ప్రాజెక్ట్ టాప్ 60 లో ఒక్కరుగా ఎంపిక అయినందున గర్వించదగ్గ విషయమన్నారు. జిల్లా నుండి నలుగురు పాల్గొన్నారు.
అందులో ఒక్కరు బాలుర ఉన్నత పాటశాల విద్యార్ధి నిఖిలేశ్వర్, సత్య సాయి స్కూల్ విద్యార్థిని సాహితి,ఆలంపూర్ నుండి దీపిక మరియు తరుణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారని తెలిపారు.
విద్యార్ధి దీపికతో మాట్లాడుతూ అదే ప్రాజెక్ట్ ఎందుకు చేయాలనిపించింది, ఈ ఆలోచన ఎలా వచ్చింది అని అడుగగా, నేను రైతు కుటుంబం నుండి వచ్చాను, రైతుల కష్టాలు చూసి ఈ నిర్ణయం తీసుకున్నాను. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని నేను కూడా కలెక్టర్ కావాలని కోరిక అని బదులివ్వగా బాగా చదువుకొని ఇలాంటి ప్రాజెక్టు లు చేయాలనీ అభినందించారు.
ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ (స్తానిక సంస్థలు ) శ్రీహర్ష, సి రాధిక, మురళి కృష్ణ, సత్తార్ వలి , మురళి మోహన్, మాధవ రాయుడు, రవి ప్రకాష్ తదితరులు ఉన్నారు….