SAKSHITHA NEWS

సంతోషం వ్యక్తం చేసిన 42‌మంది లబ్ధిదారులు

ఎస్సీలకు ఎన్నో మేలులు చేస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వారి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని ప్రభుత్వవిప్ జగ్గయ్యపేట శాసన సభ్యులు సామినేని ఉదయభాను అన్నారు.

మున్సిపల్ కార్యాలయం నందు నందిగామ మండలంలోని రుద్రవరానికి‌ చెందిన 42 మందికి జగన్న దళిత సంపూర్ణ భూ హక్కు పత్రాలను అందజేశారు. అనంతరం ఉదయభాను మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అనేకమందికి పొలాలను ఇప్పించారని, ఇప్పుడు ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పొలాలపై రుణాలను రద్దు చేస్తూ లబ్ధిదారులకు సంపూర్ణ హక్కు కలిగించారని తెలిపారు. దీనిద్వారా ఆ భూమిపై పూర్తి హక్కు ఉంటుందని, అమ్ముకోవడానికైనా, బ్యాంకు రుణాలు తీసుకోవడానికైనా వారికి సులభతరం అవుతుందని చెప్పారు. ఇప్పటిదాకా వీరికి రైతు భరోసా ద్వారా కూడా లబ్ధి చేకూరిందని వివరించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పొలాలు ఇప్పించినట్లు ఆయన గుర్తుచేశారు‌. భూహక్కు పత్రాలు ఇవ్వడంతో లబ్ధిదారులు సీయం జగన్ మోహన్ రెడ్డి కి, ఎమ్మెల్యే ఉదయభాను కి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2023 12 14 at 5.06.16 PM

SAKSHITHA NEWS