ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారాలు అందించండి
- కమిషనర్ వికాస్ మర్మత్,
ప్రజా సమస్యల పరిష్కార వేదికగా జరుగుతున్న స్పందన కార్యక్రమంలో అందుకున్న విజ్ఞప్తులకు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా విచారించి, ఫిర్యాదులు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని నగర పాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ సూచించారు. కార్యాలయంలోని ఎ.పి.జె అబ్దుల్ కలాం సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన స్పందన వేదికలో కమిషనర్ పాల్గొని “డయల్ యువర్ కమిషనర్” కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వచ్చిన 7 ఫోన్ కాల్స్ ను నేరుగా మాట్లాడారు. వివిధ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను కమిషనర్ సంబంధిత విభాగం అధికారులకు తెలియజేసి సూచించిన గడువులోపు నాణ్యమైన పరిష్కారం అందించాలని ఆదేశించారు.
అనంతరం ప్రజలనుంచి నేరుగా 30 అర్జీలను కమిషనర్ స్వీకరించారు. అందుకున్న సమస్యలకు నిర్దిష్ట గడువులోపు పరిష్కారం అందించాలని సంబంధిత అధికారులను కమిషనర్ ఆదేశించారు. సమస్యలు పునరావృతం కాకుండా నాణ్యమైన పరిష్కారం అందించాలని ఆదేశించారు.
నగరంలోని రోడ్లపై పశువుల సంచారాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటున్నామని, రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ సమస్యలకు పశువులు ముఖ్య కారణాలుగా మారాయని కమిషనర్ తెలిపారు. నగరంలోని పశువుల యజమానులు వాటిని రోడ్లపై వదిలేయకుండా సంరక్షించుకోవాలని, లేని పక్షంలో నోటీసులు జారీ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.
అదేవిధంగా టిడ్కో గృహాలకు సంభందించి వస్తున్న అభ్యర్ధనలను విచారించి అర్హులందరికీ గృహాలు కేటాయించాలని సూచించారు.
సంబంధిత విభాగాల ఉన్నతాధికారుల అనుమతులతోనే స్పందన సమస్యలకు నాణ్యమైన పరిష్కారం అందించి క్లోజ్ చేయాలని తెలిపారు.
Yet To View, జగనన్నకు చెపుదాం 1902, స్పందన,
ఎ.పి సేవా పోర్టల్ లను నగర పాలక సంస్థ అన్ని విభాగాల ఉన్నతాధికారులు ప్రతిరోజూ మూడు సార్లు పరిశీలించుకోవాలని, ఫిర్యాదులు పెండింగులో లేకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు.
స్పందన ఎండార్స్మెంట్ అందరికీ అర్ధమయ్యేలా ఉండాలని, సెక్షన్లు టెక్నికల్ విషయాలను పొందుపరచాలని కమిషనర్ సూచించారు. స్పందన అర్జీలను సంబంధిత విభాగాల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదులకు శాశ్వత పరిష్కారం అందించాలని సూచించారు.
స్పందన సమస్యలు పునరావృతం కాకుండా అధికారులంతా కృషి చేయాలని కమిషనర్ సూచించారు.
స్పందన వేదికలో అందించే ఫిర్యాదుల సంఖ్యను తగ్గించేందుకు అధికారులంతా సమన్వయంతో పని చేయాలని సూచించారు. అన్ని విభాగాల ఉన్నతాధికారులు తమ విభాగాల పనితీరును మెరుగుపరిచేందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించుకోవాలని కమిషనర్ సూచించారు. విభాగాల ఉన్నతాధికారులు వారంలో తమకు కేటాయించిన 4 సచివాలయాలను తప్పనిసరిగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించాలని, నోటీసు బోర్డుల ద్వారా సమాచారం ప్రజలకు అందేలా పర్యవేక్షించాలని కమిషనర్ ఆదేశించారు.
స్పందన వేదికలో అందుకున్న అన్ని సమస్యలకు పారదర్శకమైన పరిష్కారాన్ని, సూచించిన గడువులోపు అందించేందుకు అన్ని విభాగాల అధికారులు కృషి చేయాలని కమిషనర్ కోరారు.