అంతర్జాతీయ యోగా దినోత్సవం

Spread the love

సాక్షిత : అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని *మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి * 14వ డివిజన్ పరిధిలో గోకరాజు రంగరాజు కాలేజ్ వద్ద రిటైర్డ్ జడ్జ్ కె.జనార్ధన్,10వ డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షుడు బైండ్ల నగేష్,వారి సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యోగా శిబిరంలో పాల్గొని సభ్యులతో కలిసి యోగాసనాలు వేయడం జరిగింది.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ యోగా అనేది శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక సాధనను సాధించడానికి పురాతన మార్గమని ప్రధానంగా భారతదేశంలో ‘యోగ’ అనే పదం సంస్కృతం నుండి ఉద్భవించిందని, యోగా అనేది మనిషి తన మనస్సు, శరీరం మరియు ఆత్మను ఒకచోట చేర్చడానికి ప్రయత్నించే ప్రక్రియని, అందరూ ప్రతీ రోజు యోగ చేయాలని,ఆరోగ్యంగా ఉండాలని తెలియజేశారు.


ఈ కార్యక్రమంలో NMC బిఆర్ఎస్ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్,సీనియర్ నాయకులు వెంగయ్య చౌదరీ,బొర్రా చందు,బక్క మల్లేష్, ఆశీ మల్లేష్,మహిళా నాయకులు సబిత జలంధర్ రెడ్డి,సీనియర్ సిటిజన్స్,యోగ మిత్ర మండలి సభ్యులు, ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page