తిరుపతి జిల్లా,పుత్తూరు…
ఉపాధిహామీకూలీలకుమౌలికసదుపాయాలుకల్పించాలి -వ్యవసాయకార్మికసంఘంసబ్ కమిటీ మెంబర్ డి మహేష్ డిమాండ్…
పుత్తూరుమండలం పరమేశ్వర మంగళం పంచాయతీ పరిధిలో, కైలాసపురం, జై రానాపురం, ముట్టుగంటి సత్రం, కూర్మన్ కండ్రిగగ్రామంలో. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనిచేస్తున్నటువంటి ఉపాధి హామీ కూలీలు పనిచేస్తున ప్రదేశంలో ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సబ్ కమిటీ మెంబర్ డీ మహేష్ ప్రభుత్వ అధికారులను ఆయన డిమాండ్ చేశారు…
ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ వామ పక్ష పార్టీలు 2005 లో గ్రామీణ ప్రాంతాల నిరుపేద యువకులు వలస నివారణ అరికట్టేందుకు చట్టాన్ని తీసుకురావడం జరిగిందని, ఆ చట్టాన్ని కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఆ చట్టాన్ని నీరు కార్చేందుకు చేసే ప్రయత్నం విరమించుకోవాలన్ని ఆవేదన వ్యక్తం చేశారు…
కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఈ పథకం పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఇటీవల బడ్జెట్లో సైతం అర కోర నిధులు కేటాయించింది అన్నారు,పేదలకు ఎంతో కొంత ఆసరాగా ఉన్న ఈ పథకాన్ని నీరుగారిచేందుకు కూలీలకు ఇబ్బంది కలిగించేలా ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేపడుతూ వస్తుందని మండిపడ్డారు….
అదేవిధంగా కూలీలకు పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే మంజూరు చేయాలని పనిచోట టెంట్లు మజ్జిగ మెడికల్ కిట్ లు అందజేయాలని జాబ్ కార్డులకు అతీతంగా పని కల్పించాలని ఒక రోజుకు 600 రూపాయలు ఇవ్వాలని ప్రతి కూలికి 200 రోజులు పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు…
ఉపాధి కూలీలతో మాట్లాడి వాళ్లకు రోజు ఇస్తున్న వేతనాలు అడిగి తెలుసుకున్నారు పనిముట్లు ఇవ్వడం లేదని తమ గ్రామం నుండి ఉపాధి పని చేసే చోటకి ఐదు ఆరు కిలోమీటర్లు ఉందని ఆటోలకి రోజుకి 40 రూపాయలు తీసుకుంటున్నారని ఎత్తయిన కొండ ప్రాంతంలో ఈ వేసవిలో పని కల్పిస్తున్నారని,అయినా కూడా పనిచేస్తున్న కూలి గిట్టుబాటు కావడం లేదని అన్నారు….