బిఆర్ఎస్ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి చేరికలు
-సాక్షిత :* బిఆర్ఎస్ జిల్లా నాయకులు పెద్దిరెడ్డి కృష్ణ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన 50 మంది యువకులు బిఆర్ఎస్ లో చేరిక*
గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట జిల్లా కేంద్రంలో దినదినం పెరుగుతున్న అభివృద్ధితో ఎంతోమంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి లభిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. జిల్లా బిఆర్ఎస్ నాయకులు పెద్దిరెడ్డి కృష్ణ ఆధ్వర్యంలో చివ్వెంల, ఆత్మకుర్.ఎస్, సూర్యాపేట మండలాలకు చెందిన 50 మంది వివిధ పార్టీలకు చెందిన యువకులు, నాయకులు మంగళవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా వారికి గులాబి కండువాలు కప్పి మంత్రి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలకు, చేపడుతున్న అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు బిఆర్ఎస్ రావడం శుభ పరిణామం అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. జిల్లా టిఆర్ఎస్ నాయకులు పెద్దిరెడ్డి కృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సూర్యాపేట జిల్లా అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని ఆయన చేస్తున్న అభివృద్ధితో ఎంతో మంది యువతీ యువకులకు ఉపాధి లభిస్తుందని అన్నారు.
పార్టీలో చేరిన వారిలో ఎంతో మంది ఉన్నత చదువులు చదివిన యువకులు ఉన్నారని వారంతా బిఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని గమనించి అందులో తాము భాగస్వాములు అయ్యేందుకే బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. పదేండ్ల క్రితం ఉన్న సూర్యాపేట పట్టణ రూపురేఖలను మార్చి అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత మంత్రి జగదీష్ రెడ్డి దే అన్నారు. ఇంతటి అభివృద్ధి చేసిన నాయకుడు ప్రజల కోసం ఆలోచించే నాయకుడు గతంలో ఎవరు లేరని ఇకముందు ఎవరు రారని అన్నారు. ప్రజల కోసం పనిచేసే వారినే ప్రజా నాయకుడిగా ఎన్నుకోవాలని మంత్రి జగదీష్ రెడ్డిని మరోసారి ఆదరించి అభివృద్ధిని కొనసాగించాలని కోరారు. బి ఆర్ ఎస్ పార్టీలో చేరిన వారిలో బిజెపి దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి చిత్రం అంజయ్య, మైనార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.డి. అజిధ్, దళిత మోర్ఛ సెక్రటరీ చిత్రమ్ సతీష్, కమ్మల నవీన్, బానోతు రవికుమార్, సురేందర్, నవీన్, గోపి, మణికంఠ, గణేష్ తో పాటు మరో 40 మంది చేరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, జిల్లా మైనార్టీ నాయకులు సయ్యద్ సలీం తదితరులు ఉన్నారు.