వికారాబాద్ బహిరంగ సభలో
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రసంగం..
ముఖ్యాంశాలు :
• వికారాబాద్ కు ఒక గొప్ప చరిత్ర ఉన్నది
• వికారాబాద్ కా హవా.. లాకో మరీజోంకా దవా..
• ఇక్కడి అనంతగిరి కొండల్లో ఉన్న ఔషదాల గాలి ఆరోగ్యానికెంతో మంచిది.
• ఉద్యమ సమయంలోనే వికారాబాద్ ను జిల్లాగా ఏర్పాటు చేస్తా.. అని చెప్పిన
• ఇచ్చిన మాట ప్రకారం వికారాబాద్ ను జిల్లాగా ఏర్పాటు చేసుకున్నం.
• అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఒకేచోట చేర్చి నూతన సమీకృత కలెక్టరేట్ ను కట్టుకున్నం
• భూముల రేట్లు పడిపోతయనే అపోహతో.. రంగారెడ్డి జిల్లాకు చెందిన నాటి సమైక్యవాద తొత్తులు తెలంగాణకు అడ్డు పడ్డరు.
• కానీ నేడు తెలంగాణ వచ్చినంక, భూముల రేట్లు విపరీతంగా పెరిగినయి
• తెలంగాణ రాకపోతే.. వికారాబాద్ జిల్లాగా అయ్యేదా? ఆలోచించాలె.
• కొత్తగా 10 లక్షల మందికి పెన్షన్లు ఇస్తమని, నిన్ననే ప్రకటించినం
• వ్యవసాయం, కరెంటు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ తదితర అనేక పథకాల
• మన పథకాలు అమలు చేయాలని, పక్క రాష్ట్రాల ప్రజలు కూడా కోరుతున్నరు
• పల్లె సీమలు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో అలరారుతున్నయి.
• నీటి బకాయిలు మాఫీ చేసినం. ఇంకా కూడా భవిష్యత్ లో రైతులకెంతో చేస్తం
• గూడు చెదిరి, చెట్టుకొకరు, పుట్టకొకరు అయిన రైతులను కాపాడుకోవాలె. అనే సంకల్పం తీసుకొని అనేక రైతు కార్యక్రమాలను అమలు చేస్తున్నం
• రైతు బంధు పథకంతో ఎకరాకు ఏటా 10 వేల పంట సాయం అందిస్తున్నం.
• గతంలో ఆపద్భంధు పేరుతో 50 వేల రూపాయలు ఆఫీసుల చుట్టు తిప్పించుకొని ఇచ్చెటోళ్లు.
• ఒక గుంట భూమి ఉన్న రైతు దురదృష్టవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5 లక్షల రైతు బీమా ఇస్తున్నం. నేరుగా వారి ఖాతాల్లోనే పడుతున్నయి.
• ప్రపంచంలోనే రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలు లేవు.
• ఇలాంటి పథకాలు ఇంకెక్కడైనా ఉన్నయా.. ప్రజలు ఆలోచించాలె.. చర్చ పెట్టాలె.
• మోసపోతే.. గోస పడుతం.. మాయమాటలు నమ్మితే దోపిడీకి గురవుతం
• వచ్చిన తెలంగాణను గుంట నక్కలు పీక్కు తినకుండా చూడాలె
• కైలాసం ఆటలో పెద్దపాము మింగిన కత అయితది జాగ్రత్త
• తెలంగాణ ఆగం కాకుండా బుద్ధి జీవులు కాపాడుకోవాలె
• 14 ఏండ్ల పాటు పోరాటం చేసి, చావు అంచుదాకా పోయి తెలంగాణ తెచ్చుకున్నం.
• ఇపుడు తెలంగాణలో మంచినీళ్లు, కరెంటు బాధ లేదు.
• మిషన్ భగీరథతో ఇంటింటికీ స్వచ్ఛమైన మంచి నీళ్లిస్తున్నం.
• అన్ని రంగాలకూ 24 గంటలు నాణ్యమైన కరెంటు ఇస్తున్నం
• 26 లక్షలకు పైగా కరంటు మోటర్లకు ఉచిత కరెంటు ఇస్తున్న
• దేశంలోనే అత్యధికంగా గురుకులాలు ఏర్పాటు చేసుకున్నం.
• ఐటీ, పారిశ్రామిక రంగాలను గొప్పగా అభివృద్ధి చేసుకున్నం.
• తెలంగాణ ఆదాయం అద్భుతంగా పురోగమిస్తున్నది.
• కానీ, కేంద్రంలో ఉన్నవాళ్లు అడుగడుగునా అడ్డుపడుతున్నరు
• బీజేపీ ఎనిమిదేళ్లలో ఒక్క మంచిపని అయినా చేసిందా?
• రాజకీయంగా నిద్రాణమైన సమాజం వెనుకబడుతది
• ఎన్నికలు వస్తే.. రకరకాల మనుషులు వస్తరు.. జాగ్రత్తగా ఉండాలె
• సమైక్య పాలనలోని బాధలు మళ్లా రావద్దంటే మనం జాగ్రత్తగా ఆలోచించాలె
• విద్యుత్ సంస్కరణల పేరుతో మీటర్లు పెట్టి, రైతులకు కేంద్రం శఠగోపం పెడుతున్నరు
• మనకు ఉచిత కరెంటు ఉండాల్నా.. వద్దా? మీరే చెప్పండి
• ఇవాళ పెట్రోల్ ధర ఎంత, గ్యాస్ సిలిండర్ ధర ఎంత? ఆలోచించండి
• రైతులకు ఉచిత కరంటు ఇయ్యద్దట. కార్పొరేట్లకు లక్షల కోట్లు దోచిపెట్టాల్నట
• మనకు సింగరేణి బొగ్గున్నంక కూడా మోడీ చెప్పిన సావుకార్ల కాడ కొనాలట
• ఇవన్నీ ప్రశ్నించినందుకేనా
• ఇందుకేనా కేసీఆర్ బస్సుకు బీజేపీ వోళ్లు జెండాలు అడ్డం పెట్టేది ?
• కేసీఆర్ మంచినీళ్లియ్యలేదా.. కరెంటియ్యలేదా..భూముల ధరలు పెరగలేదా?
• పక్క రాష్ట్రం కర్ణాటక పోయి చూడండి. ఎట్లున్నదో తెలుస్తది
• అక్కడి పరిస్థితి ఏంది.. ఇక్కడి పరిస్థితి ఏందో తెలుస్తది
• ఇంతమంచి కలెక్టరేట్ భవనం వస్తదని అనుకున్నమా
• 33 జిల్లాలకు మెడికల్ కాలేజీలు ఇస్తున్నం
• తెలంగాణ రాకుంటే వికారాబాద్ కు మెడికల్ కాలేజీ, డిగ్రీ కాలేజీ వచ్చేదా?
• పాలమూరు – రంగారెడ్డి నుంచి నీళ్లు వికారాబాద్ కు తెచ్చి ఇస్తాం
• కానీ, దాన్ని కేసులేసి ఆపింది ఎవరో ప్రజలకు తెలుసు. వాళ్లను నిలదీయాలె
• కేంద్ర ప్రభుత్వ తెలివితక్కువతనం వల్ల పాలమూరు – రంగారెడ్డి ఆలస్యమైతాంది
• మోడీని చూడగానే ఇక్కడి బీజేపీ నేతల లాగులు తడిసిపోతయి
• కేంద్రానికి ఎనిమిదేండ్ల నుంచి వందల దరఖాస్తులు ఇచ్చినా పట్టిచ్చుకోలే
• నేడు ప్రధానమంత్రే మనకు శత్రువు అయిండు
• ఎన్ని అడ్డంకులెదురైనా పరిగి, చేవెళ్ల నియోజకవర్గాలకు సాగు నీళ్లందిస్తాం
• నిన్నటి ప్రధాని ప్రసంగంలో పస ఏమీ లేదు. నెత్తికి రుమాలు కట్టి గాలి మాటలు చెప్పిండు
• దేశ ప్రగతి రోజురోజుకూ దిగజారుతుంది.
• ధరలు, నిరుద్యోగం విపరీతంగా పెరిగినయి
• కేంద్రంలో కూడా రాష్ట్రాల సంక్షేమం చూసే ఉత్తమ ప్రభుత్వం రావాలె
• అందుకే ఈ కేంద్రాన్ని ఇంటికి సాగనంపుదాం
• ఈ దుర్మార్గులను తరిమికొడుదాం
• ఈ దుష్టశక్తులకు సరైన బుద్ధి చెబుతాం
• వికారాబాద్ ప్రజలు చైతన్యవంతులు
• భవిష్యత్ లో ఉజ్వల భారతదేశం నిర్మాణం దిశగా మనం కంకణ బద్దులం కావాలె.
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి
వికారాబాద్ పర్యటన – వివరాలు :
వికారాబాద్ జిల్లా లో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాయాల భవన సముదాయం (కలెక్టరేట్ కాంప్లెక్స్) ను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు మంగళవారం మధ్యాహ్నం 2.45 గంటలకు హైదరాబాద్ ప్రగతి భవన్ నుంచి బయలుదేరారు. మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషాలకు సీఎం కేసీఆర్ వికారాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత రిబ్బన్ కట్ చేసి పార్టీ కార్యాలయం లోపలకు ప్రవేశించిన సీఎం, అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ను పార్టీ కార్యాలయంలోని ఆయన కుర్చీలో కూర్చుండబెట్టి, ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు.
ఆ తర్వాత అక్కడి నుంచి సమీకృత ప్రభుత్వ కార్యాలయాల సముదాయమైన కలెక్టరేట్ కు వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి, అక్కడ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. 36 ఎకరాల్లో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కలెక్టరేట్ కార్యాలయంలో ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జరిగిన సర్వమత ప్రార్థనల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చాంబర్ లోని కుర్చీలో కలెక్టర్ నిఖిలను కూర్చుండబెట్టి, ఆశీర్వదించిన ముఖ్యమంత్రి, ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులకు సీఎం కేసీఆర్ కండువాలు కప్పి సన్మానించారు. ఆ తర్వాత వికారాబాద్ లో నూతనంగా మంజూరైన మెడికల్ కాలేజీ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ వెంట, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, పి.వి.వాణీదేవి, కాటేపల్లి జనార్దన్ రెడ్డి, బొగ్గారపు దయానంద్, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కాలె యాదయ్య, కొప్పుల మహేశ్వర్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డి, ఏ.జీవన్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి, యువనాయకులు పట్లోళ్ళ కార్తీక్ రెడ్డి ,పర్యాటక అభివృద్ధి శాఖ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్ పటేల్, జెడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, టీఆర్ఎస్ నాయకులు పంజుగుల శ్రీశైల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ వెంట ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎంవో కార్యదర్శి స్మితా సభర్వాల్, కలెక్టర్ నిఖిల, ఐజీ కమలహాసన్ రెడ్డి, ఎస్పీ కోటిరెడ్డి,ఈఎన్సీ గణపతి రెడ్డి, నిర్మాణ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ, డీఎంఈ రమేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.