గత ప్రభుత్వంలో మంత్రుల అవినీతితో అభివృద్ధి కుంటు పడింది

గత ప్రభుత్వంలో మంత్రుల అవినీతితో అభివృద్ధి కుంటు పడింది

SAKSHITHA NEWS

In the previous government, the development was hampered by the corruption of the ministers

గత ప్రభుత్వంలో మంత్రుల అవినీతితో అభివృద్ధి కుంటు పడింది….

  • నాగర్‌కర్నూల్ పార్లమెంటు సభ్యుడు మల్లు రవి…

తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా బిఆర్ఎస్ నాయకుల ప్రచారం….

  • జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇంచార్జీ సరిత తిరుపతయ్య…

పార్లమెంటు ఎన్నికలలో నాగర్‌కర్నూల్ ఎంపిగా మల్లు రవి గెలుపు పొంది మొట్టమొదటి సారిగా గద్వాల నియోజకవర్గానికి విచ్చేయుసిన సందర్భంగా మండల పరిధిలోని అనంతపురం స్టేజి వద్ద జెడ్పి చైర్ పర్సన్,గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ సరిత తిరుపతయ్య కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలతో కలిసి గజ్జెమాలతో ఘన స్వాగతం పలికారు…అక్కడి నుంచి గద్వాల పట్టణానికి విజయోత్సవ ర్యాలీగా చేరుకుని,జిల్లా కేంద్రంలోని బాబు జగ్జీవన్ రామ్,అంబేద్కర్, రాజీవ్ గాంధీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు…

అనంతరం పాత బస్టాండ్ లోని వైఎస్ఆర్ కూడలిలో పార్లమెంటు సభ్యుడు మల్లు రవి మాట్లాడుతూ….

గత కల్వకుంట్ల కుటుంబ సభ్యుల పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదని,పది సంవత్సరాల పాటు పరిపాలించిన బిఆర్ఎస్ నాయకులకు మతిభ్రమించి తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రచారం చేస్తున్నారని మల్లు రవి విమర్శించారు…బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీ లను తుంగలో తొక్కింది వాస్తవం కాదని నిరుపించుకుంటారని సవాలు విసిరాడు….గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కోసం నావంతు కృషి ఉంటుందని, అభివృద్ధి చేయడానికి గద్వాల ప్రజలకు సేవకుడిగా పని చేస్తానని, పార్లమెంటు ఎన్నికల సమయంలో నేను ఎంపిగా గెలిచి వెంటనే గద్వాల నియోజకవర్గని దత్తత తీసుకుంటానని కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ సరితమ్మకు,ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం దత్తత తీసుకొని ఈ ప్రాంతాన్నికి అని విధాలుగా అభివృద్ధిలో నా పాత్ర ఉంటుందని మల్లు రవి పేర్కొన్నారు…..

  • జెడ్పి చైర్ పర్సన్,కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ మాట్లాడుతూ….

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే.. ప్రగతి భవన్ ను జ్యోతిరావు పూలే ప్రజా భవన్ చేసిన ఘనత సిఎం రేవంత్ రెడ్డి గారికి దక్కుతుందని, గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చి పథకాలో అక్రమంగా మంత్రులు, ఎమ్మెల్యేలు,వారి నాయకుల సంపదకే సరిపోయిందని సరితమ్మ అన్నారు… కాంగ్రెస్ పార్టీ ప్రతి నాయకుడు,కార్యకర్త గ్రామాలలో ప్రజలకు అందుబాటులో ఉండి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ పథకాలు అమలు చేస్తున్న విషయం ప్రజలందరికీ సంక్షేమం అదేవిధంగా పని చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు సరితమ్మ పిలుపునిచ్చారు…ప్రస్తుతం మహాలక్ష్మి పథకం క్రింద మహిళలకు ఉచిత బస్సు సర్వీసు, గృహాజ్యోతి పథకం క్రింద ఇంటికి ఉచిత కరెంటు,ఆరోగ్య శ్రీ కింద 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు..మిగిలిన హామీలు కుడా అమలు చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని, ఎన్నికల కోడ్ వలన కొన్ని అమలు కాలేదని,బిఆర్ఎస్ నాయకులు ప్రభుత్వపై అపోహలు తీసుకొచ్చే ప్రయత్నాలను తిప్పి కొడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్దం కావడానికి కార్యచరణ రూపొందించుకొని గ్రామాలలో పార్టీ నాయకులు పని చేయాలని సరితమ్మ పిలుపునిచ్చారు…

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ జెడ్పి చైర్ పర్సన్ బండారి భాస్కర్,మాజీ కన్స్మర్ చైర్మన్ గట్టు తిమ్మప్ప, బండ్ల చంద్రశేఖర్ రెడ్డి, టిపిసిసి రాష్ట్ర నాయకులు గంజిపేట్ శంకర్,ధరూర్ మండల జెడ్పిటిసి పద్మ వెంకటేశ్వర రెడ్డి, మాచర్ల వరలక్ష్మి వెంకటస్వామి గౌడ్, ఓబిసి అధ్యక్షుడు నల్లారెడ్డి, పట్టణ అధ్యక్షుడు మహ్మద్‌ ఇసాక్, అమరావాయి కృష్ణారెడ్డి, మధుసూదన్ బాబు,గట్టు సత్యనారాయణ,లత్తిపురం వెంకట్రామిరెడ్డి,గోనుపాడు శ్రీనివాస్ గౌడ్,అల్వాల రాజశేఖర్ రెడ్డి, కృష్ణమూర్తి,సీసాలు వెంకటేష్ రెడ్డి,ఆనంద్ గౌడ్ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు,ఎంపిటిసిలు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

WhatsApp Image 2024 06 20 at 17.38.10

SAKSHITHA NEWS