SAKSHITHA NEWS

పరవాడ ఫార్మాసిటీ,అచ్చుతాపురం సెజ్ లో ఉన్న అన్ని పరిశ్రమల్లో తక్షణమే సేఫ్టీ ఆడిట్ నిర్వహించి కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని సీఐటీయూ గోడపత్రిక ఆవిష్కరణ.

సాక్షిత:- అనకాపల్లి జిల్లా ఎసెన్షియా, సెనర్జిన్ కంపెనీలో జరిగిన ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి యాజమాన్యాన్ని పై చర్యలు తీసుకోవాలని, కార్మికుల ప్రాణాలు రక్షణ, భద్రత కల్పించాలని పరవాడ ఫార్మసిటీలో శుక్రవారం గోడపత్రిక ఆవిష్కరించడం జరిగింది .ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ 17 మంది ప్రాణాలను బలిగొన్న ఎస్సెన్సియ యాజమాన్యాన్ని అరెస్టు చేయకపోవడం అన్యాయం అలాగే ముగ్గురు కార్మికులు మృతికి కారణమైన సెనర్జీన్ యాజమాన్యాలకు రాయితీ ఇస్తూ కార్మిక చట్టాలు అమలు చేయకపోవడం వల్లే తరుచు ప్రమాదాలు జరుగుతు న్నాయని విమర్శించారు. వరుస ప్రమాదాలపై తనిఖీలు లేకపోవడం వల్ల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. కార్మికుల విధులకు రావాలంటే క్షణక్షణం భయాందోళన చెందుతూవిధులు నిర్వహించాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడిందన్నారు.

ఎస్ఈజెడ్, ఫార్మాసిటీ ప్రాంతంలో వేలాదిమంది కార్మికులు పనిచేస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేకపోవడం కార్మికుల ప్రాణాలు పోవడానికి కారణం అవుతుంది అన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత ప్రాథమిక చికిత్స అయిన లేకపోవడం వల్ల విశాఖపట్నం వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ లోగానే కార్మికులు ప్రాణాలు గాలీలో కలిసిపోతున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అన్ని పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహించి ఈ ప్రాంతంలో బర్నర్ వార్డుతో కూడిన 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేయాలని గని శెట్టి డిమాండ్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మిగిలిన వారికి మెరుగైన వైద్య సదుపాయం ప్రభుత్వ బాధ్యత తీసుకోవాలని కోరారు. ఇప్పటికైనా లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు పరిశ్రమలు తనిఖీ అధికారులు భద్రత ప్రమాణాలు మెరుగుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు . లేని పక్షంలో ఆందోళన చేపడతామని గని శెట్టి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు,తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS