SAKSHITHA NEWS

If the police system, which is writing the era of democracy, can be cheeky, then the officers should be sidelined

ప్రజాస్వామ్యాన్ని కాల రాస్తున్న పోలీస్ వ్యవస్థ బుగ్గన చేతనైతే అధికారులను పక్కన పెట్టి డైరెక్టుగా తెల్చుకుందం రా


సాక్షిత కర్నూల్ జిల్లా ఇంచార్జ్

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో అంబాపురం కె.శ్రీనివాసులు నామినేషన్ వేయడంలో ప్రపోజల్స్ గా ఉన్న తెలుగుదేశంపార్టీ సంబంధించిన కౌన్సిలర్ లను, ఎంపిటిసి లను నిన్నటి అర్ధరాత్రి నుండి పిలుచుపోవడమైనది. ఇంతవరకు ఇటువంటి ఆచూకీ తెలియకపోవడంతో డోన్ నియోజకవర్గ టిడిపి అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డి వారి కుటుంబ సభ్యులు , డోన్ నియోజకవర్గ టిడిపి నాయకులు, కార్యకర్తలతో కలసి “డోన్ పట్టణంలోని డిఎస్పీ కార్యాలయం నందు ఫిర్యాదు చేయడం జరిగింది”.

అనంతరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన తెలుపూ.డోన్ నియోజకవర్గ టిడిపి అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డి రాష్ట్ర తెలుగుదేశంపార్టీ కార్యదర్శి వై.నాగేశ్వరావు యాదవ్ రాష్ట్ర తెలుగుదేశంపార్టీ కార్యదర్శి వలసల రామకృష్ణ మాట్లాడుతూ. స్థానిక సంస్థల ఎన్నికల ఎమ్మెల్సీ నామినేషన్ వేసేందుకు ప్రతిపాదించిన వారిని ఆర్థిక శాఖ మంత్రి పోలీసులను ఉపయోగించుకొని మా తెలుగుదేశంపార్టీ కౌన్సిలర్లను ఎంపీటీసీలను దేశద్రోహుల మాదిరిగా నిన్నటి నుంచి అర్ధరాత్రి వారి ఇంటికి వెళ్లి సి.ఐ పిలుస్తున్నారని పోలీసులు ఆడవారిని ఇబ్బంది పెట్టి భర్తలను పీలుచుకపోవడం సిగ్గు చేటని అన్నారు.

బిసి లకు పోటీ చేసే హక్కు లేదనట్టుగా ఒక బీసీ సర్పంచ్ పోటి చేస్తే ఇంత దారుణంగా పోలీసులు అక్రమంగా ప్రతిపాందించిన వారిని భయభ్రాంతులకు గురి చేసి , చిత్రహింసలు పెట్టి వారి చేత బలవంతంగా మేము ప్రపోజల్స్ చేయలేదని విధంగా చెయించి నామినేషన్ తిరస్కరించే విధంగా కుట్రలు పన్నారు అన్నారు. నాలుగు సంవత్సరాల కాలం నుండి పోలీసు వ్యవస్థ అధికార పార్టీ కి తొత్తులుగా వ్యవహరిస్తూ పోలీసు వ్యవస్థ భ్రష్టు పట్టించారని అన్నారు.

ఇలాంటి పోలీసు అధికారుల మీద మరియు అధికార పార్టీ పైన చట్ట పరమైన పోరాటం చేసేందుకు తెలుగుదేశంపార్టీ ఎప్పటికి వెనుకాడదని అన్నారు.ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా టిడిపి ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి గంధం శ్రీనివాసులు డోన్ మండలం టిడిపి అధ్యక్షులు సలీంద్ర శ్రీనివాసులు యాదవ్ ప్యాపిలి మండలం టిడిపి అధ్యక్షులు గండికోట రామసుబ్బయ్య నంద్యాల జిల్లా టిడిపి బిసి సెల్ అధ్యక్షులు ప్రజావైద్యశాల మల్లిఖార్జున బేతంచేర్ల మండలం టిడిపి ప్రధాన కార్యదర్శి షేక్షవళి చౌదరి తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS