SAKSHITHA NEWS

ఎద్దు ఏడిస్తే ఎవుసం నిలువదు…రైతు కన్నీరు పెడితే రాజ్యం నిలువదు : బిఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు…
అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించిన అనంతరం మహా ధర్నా నిర్వహించిన బిఆర్ఎస్ శ్రేణులు….

సాక్షిత* : బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ , ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆదేశానుసారం కుత్బుల్లాపూర్ లోని దుందిగల్ ఎమ్మార్వో కార్యాలయం ముందు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని మహాధర్నాను విజయవంతం చేశారు. మొదట అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన బిఆర్ఎస్ శ్రేణులు, అనంతరం మహాధర్నా నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్క రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేయాలని కోరుతూ ఎమ్మార్వో కి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు, సహకార సంఘం బ్యాంకు డైరెక్టర్లు, రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఆలోచనతో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రేషన్ కార్డును సాకుగా చూపి రుణమాఫీని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల ముందు గుర్తురాని రేషన్ కార్డులు ఎన్నికల తర్వాత ఇప్పుడు గుర్తుకొస్తున్నాయా…? అని
ప్రభుత్వ తీరును ప్రశ్నించారు. కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలోని భౌరంపేట సహకార సంఘం బ్యాంకులో మూడు కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉండగా కేవలం నాలుగు లక్షల రూపాయల రుణమాఫీ చేసి అందరికీ రుణమాఫీ చేశామంటూ ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తూతూ మంత్రంగా రుణమాఫీ చేశామంటూ చేతులు దులుపుకోకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి బేషరతుగా రుణమాఫీ చేయాలని, అందరికీ రుణమాఫీ చేసేవరకు కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, చైర్మన్ లు,కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, పాక్స్ డైరెక్టర్లు, రైతు సంఘాల నాయకులు, జిహెచ్ఎంసి డివిజన్ అధ్యక్షులు, మహిళా నాయకురాలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 08 22 at 14.04.51

SAKSHITHA NEWS