SAKSHITHA NEWS

రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తే.. వీపు చింతపండు అయితది: కేటీఆర్ కు రేవంత్ వార్నింగ్…!!!

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి తీరుతామని… కొందరు సన్నాసులు.. రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే తొలగిస్తామంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోల్పోయినా.. బలుపు మాత్రం తగ్గలేదని.. రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తే.. వీపు చింతపండు అవుతుందని వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్.

రాజీవ్ గాంధీ 80వ జయంతి సందర్భంగా సోమాజీగూడ సర్కిల్ లో ఉన్న ఆయన విగ్రహానికి నివాళులర్చిన సీఎం రేవంత్ మాట్లాడుతూ.. దమ్ముంటే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేయండి.. అంతు చూస్తామని హెచ్చరించారు. పదేళ్లు తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. 10ఏళ్లు అధికారంలో ఉండి.. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేని వారికి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం.. సచివాలయం బయట కాదు.. లోపల పెడతామని రేవంత్ అన్నారు. డిసెంబర్ 9 నాటికి తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని స్పష్టం చేశారు.

“కేటీఆర్ తన తండ్రి విగ్రహాన్ని సచివాలయం ముందు పెట్టాలనుకున్నారంట.. కేసీఆర్ సచ్చేది ఎప్పుడు.. ఆయన విగ్రహాన్ని పెట్టేదెప్పుడు.. మీ అయ్యా తెలంగాణను పదేళ్లు దోచుకున్నాడు. దొంగలకు సచివాలయంలో స్థానం లేదు” అని రేవంత్ దుయ్యబట్టారు.

WhatsApp Image 2024 08 20 at 15.47.59

SAKSHITHA NEWS