సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ కాలనీ లో సివరేజ్ లైన్ పొంగి పొర్లుతున్నదని కాలనీ వారి విజ్ఞప్తి మేరకు, జలమండలి మరియు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు . ఈ సందర్భంగా నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ, డ్రైనేజ్ పైప్ లైన్ పొంగి అపరిశుభ్రంగా ఉన్నాయి అని తెలుసుకొని, జలమండలి మరియు ఇంజనీరింగ్ అధికారులతో తక్షణమే పనులు మొదలుపెట్టించి, త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తేవాలని చెప్పడం జరిగింది, అలాగే హైదర్ నగర్ డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని, డివిజన్ ను ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దడానికి నా వంతు శాయ శక్తుల కృషి చేస్తానని కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, జలమండలి సూపర్వైజర్ నరేంద్ర, డివిజన్ వాసులు శాంత రామ్, కే వి చౌదరి, సురేష్, పూర్ణ చందర్ రావు, ప్రసాద్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ కాలనీ లో సివరేజ్ లైన్ పొంగి పొర్లుతున్నదని కాలనీ వారి విజ్ఞప్తి
Related Posts
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ రామ్ నగర్, HMT హిల్స్
SAKSHITHA NEWS హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ రామ్ నగర్, HMT హిల్స్, సమత నగర్ కాలనీలలో రూ.61.50 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి…
మున్సిపల్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి
SAKSHITHA NEWS మున్సిపల్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ నేడు మున్సిపల్ చైర్మన్ G చిన్న దేవన్న తో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలన జోగులాంబ గద్వాల జిల్లా…