మానవ సేవే మాధవ సేవ
సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : మానవసే మాధవసేవ ఈ పదానికి సరిగ్గా సరిపోల్చే సంఘటన సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామంలో చోటు చేసుకుంది. గత కొద్ది రోజులుగా మతిస్థిమితం సరిగా లేని ఓ మహిళ టేకుమట్ల గ్రామ బస్టాండ్ వద్ద రోడ్డు పై ఉంటూ అక్కడే నిద్రపోతూ ఉంటుంది. నిత్యం ఎంతోమంది చూసుకుంటూ వెళ్తున్నారు కానీ భగవంతుడు కొన్ని హృదయాలను తట్టి లేపినట్టు గ్రామానికి చెందిన పల్లె దవాఖానా డాక్టర్ పావని మనస్సు చలించింది.
మతిస్థిమితం సరిగా లేకుండా రోడ్డుపైన దిక్కులేని స్థితిలో ఉన్న ఆ మహిళను చూసిన డాక్టర్ పావని వారి టీమ్ కు సమాచారం తెలుపగా గ్రామ ఆశ వర్కర్లు ఆమెకు స్నానం చేయించి నూతన దుస్తువులు వేసి ఆమెకు భోజనం పెట్టారు. అంతే కాకుండా ఆమెను అలా వదిలేయొద్దు అనుకున్నా వారు గుంటూరు జిల్లాలోని అమ్మ అనాధాశ్రమంలో డాక్టర్ పావని సొంత ఖర్చులతో ఆమెను ఆశ్రమంలో చేర్పించారు. ఈ ఘటన మనుషుల్లో మానవత్వం బ్రతికే ఉందని సమాజానికి తెలియజేస్తుంది. మంచి మనసుతో సేవ చేసిన డాక్టర్ పావని మరియు టేకుమట్ల గ్రామ ఆశ వర్కర్లు విజయ, కుమారి, పులమ్మ, నాగమని లకు గ్రామ ప్రజలు అభినందనలు తెలియజేశారు.