
టీఎస్ యుటిఎఫ్ (TSUTF) నూతన డైరీ, క్యాలెండర్ను ఆవిష్కరించిన గోపాల్పేట ఎంఈఓ
సాక్షిత వనపర్తి
తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ 2025 సంవత్సరపు డైరీ, క్యాలెండర్ ను గోపాల్ పేట్ ఎంఈఓ శ్రీనివాస్ గౌడ్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు .రమాకాంత్ ల చేతుల మీదుగా ఆవిష్కరించారు.
అనంతరం ఎంఈఓ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి జి కృష్ణ మాట్లాడుతూ 51 శాతం ఫిట్మెంట్ తో ప్రభుత్వం PRC నివేదిక ప్రకటించాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని, పెండింగ్ లో ఉన్న నాలుగు DA లను వెంటనే మంజూరు చేయాలని , కామన్ సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించి పర్యవేక్షణ అధికారులను నియమించాలని, అదేవిధంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో (TSUTF) టీఎస్ యుటిఎఫ్ మండల అధ్యక్షలు J.గంగన్న, అధ్యక్షులు సుభాష్ చంద్రబోస్, K.గోపాల్, రజిని బాబు మాసన్న, బి.కృష్ణ, పరమేష్ శేషయ్య, తాజోద్దీన్, సునీత, అనిత సుస్మిత, మంగమ్మ, శ్రీలత తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
