SAKSHITHA NEWS

: ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తూ జగనన్న ఆరోగ్య సురక్ష పధకం ద్వారా ప్రజలందరికి ఆరోగ్య పరీక్షలు చేయడం, ఉచితంగా మందులు అందచేయడంతో పాటు అవసరమైన వారికి తదుపరి పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం అందిస్తున్నామని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. ప్రభుత్వం అంటే ప్రజలకు సేవ చేయడం అనేది కేవలం నినాదం మాత్రమే కాదని, అది ప్రభుత్వ విధానమన్నారు. కొవ్వూరు మండలం *వేములూరు గ్రామంలో ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ప్రతి స్టాల్ ను పరిశీలించారు, అలాగే వైద్యులతో, సిబ్బందితో అక్కడికి విచ్చేసిన రోగులతో వివరాలు అడిగి తెలుసుకొని కొన్ని సూచనలు ఆదేశాలు జారీ చేశారు

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులతో పాటు చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్ వైద్య నిపుణులు, ఇతర వ్యాధులకు సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్లు, ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

జారీ చేసిన వారు : హోం మంత్రి వారి క్యాంపు కార్యాలయం, కొవ్వూరు.


SAKSHITHA NEWS