govt ప్రభుత్వ బాలికల పాఠశాలను హోం మంత్రి అనిత తనిఖీలు…
సాక్షిత : పాయకరావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల, మంగవరం రోడ్ లోని ప్రభుత్వ బాలికల పాఠశాలలను హోం మంత్రి వంగలపూడి అనిత ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. మధ్యాహ్న భోజన పథకం ను పరిశీలించారు. సమస్యలు ఉంటే చెప్పాలంటూ విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు.ప్రతీ విద్యార్థి ఆమెను కలసి కరాచలనం చేయడానికి ఆసక్తి చుపించారు. ఆమె విద్యార్థుల అందరితో కరాచలనం చేశారు. అలాగే ఉపాధ్యాయులతోనూ చర్చించారు.పాటశాల పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పాయకరావు పేట బాలికల పాఠశాల వద్ద గంజాయి సేవిస్తూ యువకులు తిరుగుతున్నట్లు ఉపాధ్యాయులు ద్వారా సమాచారం అందుకున్న మా పోలీస్ సిబ్బంది పాఠశాల ఆవరణలో సి.సి.కెమెరా లు కూడా అమర్చడం జరిగిందన్నారు. అంతే కాకుండా ఈ పాఠశాల ,కళాశాలల్లో విద్యార్థులు ల్యాబ్ లు ,బిల్డింగ్ లు లేకపోవడం తో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారన్నారు.
గంజాయి రహిత రాష్ట్రం ను రానున్న రోజుల్లో చూడబోతున్నామని హామీ ఇచ్చారు.విద్యార్థుల కు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని సబంధించిన అధికారులను ఆదేశించారు.
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app