SAKSHITHA NEWS

స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో హోలీ సంబురాలు.

రంగులు చల్లుకుంటూ ఆనందోత్సవాలు జరుపుకున్న పాఠశాల విద్యార్థులు.

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో విద్యార్థులు హోలీ సంబరాలు నిర్వహించారు. సహజమైన రంగులతో పాఠశాల చిన్నారులు హోలీ వేడుకలలో పాల్గొన్నారు. విద్యార్థులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ వసంతోత్సవం జరిపారు.

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చింత నిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ పురాణాల కాలం నుంచి హోలీ వేడుకలకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. ప్రకృతి రమణీయతలోని వివిధ రంగురంగుల పుష్పాల విశిష్టత , వాతావరణ మార్పులకు చిహ్నంగా హోలీ పర్వదినాన్ని జరుపుకుంటున్నామన్నారు. బంధుమిత్రుల మధ్య అనురాగ ఆప్యాయతలు పెంపొందడానికి హోలీ వేడుకలు దోహదపడుతున్నాయని వివరించారు.

వసంతకాల ఆగమనాన్ని తెలియజేసే హోలీ పర్వదిన ప్రత్యేకతను తెలియజేయడానికి తమ పాఠశాలలో హోలీ సంబరాలను నిర్వహించామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS