Hip and knee replacement surgery by robotic technology for hip problems
హిప్ సమస్యలుకు రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తుంటి, మోకాళ్ళ చిప్పల ఆపరేషన్ డాక్టర్ ఏ వి గురువారెడ్డి
సాక్షిత సికింద్రాబాద్ : కోవిడ్ 19 ఇన్ఫెక్షన్ నుండి కోలుకున్న చాలా మంది రోగులు తుంటే(హిప్ ) సంబంధ సమస్యలతో బాధపడుతున్న వారిసంఖ్య పెరుగుతోంది.ప్రస్తుతం కోవిడ్ తరువాత దీర్ఘకాలికంగా ఈ సమస్యలు పరుగుతుండం అందోళన కలిగిస్తోన్న అంకం.ఈ రోగులలో ఏవిఎన్అనేది కోవిడ్ లేదాకోవిడ్ ఇన్ఫెక్షన్ చికిత్స సమయంలో స్టెరాయిడ్ల ఉపయోగించడం వల్ల ఈ సమస్యలు పెరుతున్నట్లుగా చెప్పవచ్చు.కోవిడి 19 ఇన్ఫెక్షన్ నుండి కోలుకున్న 6-9 నెలల తర్వాత లక్షణాలుతరచుగా కనిపిస్తాయి. 40, 50 శాతం మందిలో ఈ సమస్యలు తలెత్తుతున్నట్లు సర్వేలచెప్తున్నాయి. ఇందులో తుంటి కీళ్ల నొప్పులతో బాధపడుతున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది.
ఇలాంటి పరిస్థితులను ప్రారంభ దశలోనే గుర్తిం చి చికిత్సను అందించడం చాల అవసరం.ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకు కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించేందుకు కార్యక్రమాన్ని నిర్వహింస్తున్నట్లు కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్స్,చీఫ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ ఏ.వి.గురవారెడ్డి తెలిపారు.ఇలాంటి పరిస్థితుల్లో ప్రారంభ రోగ నిర్ధారణ కీలకమైనదిగా పరిగణించచ్చు.
అవాస్కులర్ నెక్రోసిస్ (ఏవి) అనేది ఎముకలను బలహీనపరిచే పరిస్థితి, ఈ పరిస్థితుల్లో తొడ తుంటి భాగంలో ఎముకలకు రక్త సరఫరాకు అంతరాయం కలిగిస్తుంది.ఈ పరిస్థితులు క్రమేనానెక్రోసిస్ కు దారితీస్తుంది.కార్టికోస్టెరాయిడ్ మరియు ఆల్కహాల్ఎక్స్పోజర్,ఆటో ఇమ్యూన్ వ్యాధులు,సికిల్ సెల్ వ్యాధి మరియు హెచ్ఐవివంటి సమస్యలు ప్రధాననగా చెప్పవచ్చు.అయితే చాలాసందర్భాలలో ఇడియోపతిక్(కారణం తెలియదు). వైద్యపరంగా వారు హిప్ జాయింట్లోనొప్పి, నడవడంలో ఇబ్బంది మరియు అవయవం వెలుపల మరియు అంతర్గతంగా ఇబ్బందులు గురించి ఫిర్యాదు చేస్తారు. తుంటి ఏవిఎన్ సాధారణ ఎక్సరే మరియు ఎమ్మార్ఐలతో నిర్ధారణ చేయవచ్చు.
ఇలాంటి పరిస్థితుల్లో చికిత్స ఎంపిక చాల ముఖ్యమైనది.వీటిలోఎన్ఎస్ఏఐడి లు, బిస్పాస్పోట్స్,ఫిజియోథెరపీ, లైఫ్ స్టైల్ సవరణలు మరియు శస్త్రచికిత్సాలు.కోర్ డికంప్రెషన్,టెన్ మ్యారో ఇంజెక్షన్లు,పిఆర్పి థెరపీ, హిప్ చుట్టూ ఆస్టియోటోమీలు మరియు హిప్ రీప్లేస్మెంట్ వంటి జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలుఉన్నాయి.అడ్వాన్స్ స్టేజిలో హిప్ రీప్లేస్మెంట్ వల్ల తిరిగి సాధారణ జీవితం గడిపేందుకు అవకాశం ఉంటుంది.
ఇటీవల హిప్ రీప్లేస్మెంట్ చేయించుకొని సాధారణ జీవితం గడుపుతున్న 31 సంవత్సరాలు షేక్ ఇస్మాయిల్ రోబోటిక్ ద్వారా జాయింట్ రీప్లేస్మెంట్ చేశామని ఆపరేషన్ విజయవంతం అయిందని సర్జన్ డాక్టర్ అన్నపురెడ్డితెలియజేశారు,ఈ కార్యక్రమంలో కిమ్స్ సన్ షైన్ఆసుపత్రి రీజనల్ చీఫ్ ఆపరేటింగ్ఆఫీసర్ సౌరవ్ గుప్తా,రోబోటిక్ సర్జన్ డాక్టర్ విబిఎన్ ప్రసాద్,డాక్టర్ సుహాస్,మెడికల్ డైరెక్టర్ పవన్ కులకర్ణి తదితరులు పాల్గొన్నారు.