హీరో విజయ్ కీలక ప్రకటన… పార్టీ జెండా అవిష్కరణ
తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి కీలక ప్రకటన చేశారు.
తన పార్టీ తమిళగ వెట్రి కజగం జెండాను ఆయన రిలీజ్ చేశారు.
చెన్నైలోని పనయూర్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉదయం 9గంటలకు పార్టీ జెండాను ఆయన అవిష్కరించారు. ఎరుపు, పసుపు రంగు కలిపి రెండు ఏనుగులతో జెండా ఉంది. మధ్యలో ఒక పువ్వు కూడా ఉంది. అనంతరం పార్టీ సిద్దాంతాలను విజయ్ ప్రకటించారు. కులం,మతం, ప్రాంతం, లింగం అనే విభేదాలు లేకుండా అందరికీ సమానమైన అవకాశాలు కలిపించడమే తమ పార్టీ లక్ష్యమని విజయ్ చెప్పుకొచ్చారు.
ఈ కార్యక్రమంలో దాదాపు 300 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయ్ తమిళగ వెట్రి కజగం పార్టీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ చేసిన విజయ్.. తొలి అడుగుగా జెండా అవిష్కరణ చేశారు. త్వరలో విజయ్ చెన్నైలో ఓ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది.
ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికలలో ఆయన పార్టీ ఏ రాజకీయ కూటమికి మద్దతు ఇవ్వలేదు. తమిళనాడులో అధికార డీఎంకె నేతృత్వంలోని కూటమి ఎన్నికలలో విజయం సాధించింది. ఇదిలా ఉంటే విజయ్ తాజా చిత్రం గాట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) సెప్టెంబర్ 5న విడుదలకు సిద్ధంగా ఉంది.